Dates With Honey : తేనెంత తియ్యటిది మరొకటిది లేదని మనం తియ్యదనానికి పోలికకు తేనెను సూచిస్తూ ఉంటాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం తేనె అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు కలిగిన తేనె సహజ సిద్దమైన యాంటీ బయాటిక్. శరీరానికి శక్తిని ఇస్తూనే బరువు పెరగకుండా చేస్తుంది తేనె. అందుకే మన పెద్ద వారు తేనెను సర్వరోగనివారిణి అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనె చక్కటి ఔషధంలా పని చేస్తుంది. అదే విధంగా ఏ పండైనా పండుగా ఉంటూనే రుచిగా ఉంటుంది. కానీ ఖర్జూర పండు పండుగా ఉన్నా ఎండినా కూడా రుచిగా ఉంటుంది. ఖర్జూరంలోని నీరు ఎంతగా ఆవిరైతే అది అంతగా తియ్యగా ఉంటుంది.
మెత్తని పండ్లకోసం అయితే అవి రంగు మారి దోర రంగులోకి రాగానే చెట్టు నుండి వేరు చేస్తారు. అదే ఎండుకర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. ఖర్జూరాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద ప్రేగులోని సమస్యలకు ఈ పండులోని ట్యానస్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి వాటికి ఈ పండు గుజ్జు మంచి మందు. ఖర్జూరం తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. ఎముకలు ధృడంగా మారతాయి. ఉదర క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడంలో కూడా ఖర్జూర పండ్లు మనకు దోహదపడతాయి.
ఈ ఖర్జూర పండ్లను తేనెతో కలిపి తీసుకుంటే మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లలకు, పెద్దలకు మంచి పౌష్టికాహారంలా పని చేస్తుంది. తేనె, ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక బాటిల్ తీసుకుని అందులో సగానికి తేనెను పోయాలి. ఇప్పుడు గింజలు తీసేసిన ఎండు ఖర్జూరాలను అందులో వేసి మునిగేంత వరకు తేనె పోయాలి. వీటిని కదిలించకుండా వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. వారం తరువాత ఒక స్పూన్ సహాయంతో రోజుకు ఒకటి తీసుకుని తినాలి. ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. జీవక్రియల రేటును పెంచుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగుతుంది. తద్వారా మనం రోగాల బారిన పడకుండా ఉంటాం. షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ మిశ్రమం మేలు చేస్తుంది. తేనె, ఖర్జూరాలను కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మలబద్దకం సమస్య నివారించబడుతుంది. తేనె, ఖర్జూరాలను కలిపి తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని వీటిని తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.