ఆరోగ్యం

పిల్లల కోసం బ్రెయిన్ ఫుడ్స్.. వీటిని తినిపిస్తే పిల్ల‌ల్లో తెలివితేట‌లు పెరిగి చ‌దువుల్లో రాణిస్తారు..!

మీరు కూడా మీ పిల్లల మెదడుకు పదును పెట్టాలనుకుంటున్నారా ? అవును.. అయితే ఈ క‌థ‌నాన్ని త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే. ప్రస్తుత పోటీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ పిల్ల‌ల‌ను వారు చేసే ప్రతి పనిలోనూ ముందు ఉండాలని కోరుకుంటున్నారు. అందుక‌ని వారిని టాప్‌ స్థానంలో చూడాలంటే వారికి ఇచ్చే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. పిల్లలను శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంచడానికి మంచి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కింద తెలిపిన ఆహారాల‌ను పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వ‌డం వ‌ల్ల వారి మెద‌డు చురుగ్గా మారుతుంది. తెలివి తేట‌లు పెరుగుతాయి. చ‌దువుల్లో రాణిస్తారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

feed these foods daily to kids for their memory and intelligence

1. చేపలు

పిల్లల మెదడుకు పదును పెట్టడానికి చేపలు చాలా అవసరం. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు కణజాలాల బ్లాక్‌లను నిర్మించడంలో సహాయపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు క‌లుగుతాయి. ఇవి మెదడు పనితీరు, పిల్ల‌ల‌ అభివృద్ధికి సహాయపడుతాయి.

2. కోడిగుడ్లు

పిల్లల మెదడు ఆరోగ్యానికి గుడ్లు తప్పనిసల‌ని నిపుణులు అంటున్నారు. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కోలిన్, లుటిన్, జింక్ ఉంటాయి. ఈ పోషకాలు పిల్లలు శ్రద్ధగా ఉండగల సామర్థ్యాన్ని పెంచుతాయి. జ్ఞాప‌క‌శ‌క్తి మూల కణాలను తయారు చేయడంలో కోలిన్ సహాయపడుతుంది. గుడ్లు తినడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వారు చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

3. పెరుగు

పిల్లల మెదడు అభివృద్ధికి పెరుగు ఎక్కువ దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. పెరుగును క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల మెదడు వెంటనే స్పందించే సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శక్తి పెరుగుతాయి. విష‌యాల‌ను త్వ‌ర‌గా నేర్చుకుంటారు.

4. కూరగాయలు

పదునైన మెద‌డుకు పాలకూర, అరటి, బ్రోకలీ వంటి కూరగాయలు, ఆకు కూర‌లు, పండ్లు సహాయపడతాయి. టమోటాలు, బ్లూబెర్రీస్, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీస్ వంటివి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువ‌ల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతాయి.

5. తృణధాన్యాలు

తృణధాన్యాలు పిల్లల మెదడుకు శక్తిని ఇస్తాయి. ధాన్యాలలో గ్లూకోజ్ ఉంటుంది. అది రక్త నాళాలలోకి నెమ్మదిగా విడుదల అవుతుంది. అది పిల్లల శరీరాన్ని రోజంతా శక్తివంతం చేస్తుంది. ధాన్యాల‌లో ఫోలిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది మెదడు సమర్థవంతంగా పని చేసేందుకు స‌హాయ ప‌డుతుంది.

6. ఓట్స్

విటమిన్ ఇ, జింక్, బి విట‌మిన్లు ఓట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఓట్ మీల్ లో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది పిల్లలకు శక్తిని అందిస్తుంది. ఓట్స్ ను అల్పాహారంగా పిల్లలకు ఇస్తే వారి మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. ఎక్కువ విష‌యాల‌ను నేర్చుకుంటారు.

Admin

Recent Posts