Alubukhara : అల్ బుక‌రా పండ్ల‌ను మిస్ చేసుకోకండి.. వీటిని తిన‌క‌పోతే అనేక లాభాల‌ను కోల్పోతారు..!

Alubukhara : ఈ వ‌ర్షాకాలంలో మార్కెట్ లో ఎక్కువ‌గా ల‌భించే పండ్లలో అల్ బుక‌రా పండ్లు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడ‌గానే తినాల‌నించేలా ఉండే ఈ పండ్లు తియ్య‌ని, పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అల్ బుక‌రా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లు పోష‌కాల గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. ఈ పండ్లలో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, విట‌మిన్ డిల‌తోపాటు ఐర‌న్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ ఉంటాయి.

వ‌ర్షాకాలంలో ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. మ‌న శ‌రీరంలో ఉండే విష‌తుల్యాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో ఈ పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఎముక‌ల‌ను, దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో అల్ బుక‌రా పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉండే వేడి త‌గ్గి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. గ‌ర్భిణీలు వీటిని తిన‌డం వ‌ల్ల త‌గినంత ఫోలిక్ యాసిడ్ ల‌భించి గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

amazing health benefits of Alubukhara fruits amazing health benefits of Alubukhara fruits
Alubukhara

దృష్టి లోపాల‌తో బాధ‌ప‌డే వారు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా ఈ అల్ బుక‌రా పండ్లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానిక త‌క్ష‌ణ శ‌క్తి ల‌భించడంతోపాటు అల‌స‌ట కూడా త‌గ్గుతుంది. శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగేలా చేయ‌డంలో, అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో, శ‌రీరాన్ని క్యాన్సర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా ఈ అల్ బుక‌రా పండ్లు తోడ్ప‌డ‌తాయి.

చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, స‌హ‌జ సిద్ధంగా బ‌రువు త‌గ్గ‌డంలో ఈ పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ పండ్లలో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా వీటిని తిన‌డం వ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ అల్ బుక‌రా పండ్ల‌ను మితంగా తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌మ‌ని, వీటిని అధికంగా తిన‌డం కూడా శ‌రీరానికి అంత మంచిది కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts