Anjeer Juice : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లల్లో అంజీరా పండు కూడా ఒకటి. ఈ పండు మనందరికి తెలిసిందే. ఇవి మనకు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా లభిస్తాయి. అంజీరా పండ్లు ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. ఈ పండు లోపల చిన్న చిన్న గింజలతో చాలా రుచిగా ఉంటుంది. అంజీరా పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంజీరా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీరా పండ్ల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంజీరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
అంజీరా పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో జ్యూస్ ను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. అంజీరా పండ్లతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 3 అంజీరా పండ్లను శుభ్రంగా కడిగి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో రెండు టీ స్పూన్ల పంచదార, అర గ్లాస్ పాలు, అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిలో పంచదారకు బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు.
ఈ విధంగా అంజీరా పండ్లతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించడంలో అంజీరా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అంజీరా పండ్లను తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతునొప్పిని తగ్గించడంలో, మొలల సమస్య నుండి బయట పడేయడంలో కూడా అంజీర్ల మనకు ఉపయోగపడతాయి. అంజీరా పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అంజీరా పండ్లు మనకు దోహదపడతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా అంజీరా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.