Tomatoes : టమాటాలను చాలా మంది రోజూ నిత్యం ఏదో ఒక వంటలో వాడుతుంటారు. టమాటాలు లేనిదే చాలా మంది ఏ కూరను కూడా చేయరు. టమాటాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. టమాటాలు తక్కువ క్యాలరీలను, అధికంగా పోషకాలను కలిగి ఉంటాయి. అలాగే మన శరీరానికి ముఖ్యమైన పోషణను అందిస్తాయి. ముఖ్యంగా టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇంకా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే టమాటాలను తినడం వల్ల లాభాలు కలిగినప్పటికీ వీటిని మోతాదులో మాత్రమే తినాల్సి ఉంటుంది. అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దుష్పరిణామాలు కలుగుతాయి. ముఖ్యంగా టమాటాలను అధికంగా తినడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. టమాటాలు యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక టమాటాలను అధికంగా తింటే పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్లు పెరుగుతాయి. దీంతో కడుపులో మంట వస్తుంది. గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది సమస్యలకు గురి చేస్తుంది. కనుక టమాటాలను తక్కువ మోతాదులోనే తినాల్సి ఉంటుంది.
టమాటాలలో సోలనైన్ అనే ఆల్కలాయిడ్ అధికంగా ఉంటుంది. ఇది కీళ్లలో వాపును, నొప్పిని కలగజేస్తుంది. కనుక టమాటాలను అధికంగా తినరాదు. తింటే కీళ్ల నొప్పులు వస్తాయి. అలాగే టమాటాల్లో హిస్టామైన్ సమ్మేళనం ఉంటుంది. టమాటాలను అధికంగా తింటే శరీరంలో హిస్టామైన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అలర్జీలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి. దురదలు వస్తాయి. కాబట్టి టమాటాలను అతిగా తినరాదు. అలాగే టమాటాలను అధికంగా తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతోపాటు టమాటాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది కనుక వీటిని అధికంగా తింటే లైకోపీనోడెర్మియా అనే చర్మ వ్యాధి వస్తుంది. దీంతో చర్మం రంగు మారుతుంది. కనుక టమాటాలను మోతాదులో మాత్రమే తినాల్సి ఉంటుంది. అధికంగా తింటే ఇబ్బందులు తప్పవు.