Watermelon : పుచ్చ‌కాయ‌ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

Watermelon : బ‌రువు త‌గ్గ‌డానికి, రోజంతా ఉత్సాహంగా ఉండ‌డానికి, అలాగే త‌గినంత బ‌రువు ఉండ‌డానికి, శారీర‌ ఆకృతి కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరంలో అధ‌నంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కండ‌రాలు, ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే వ్యాయామం చ‌క్క‌టి మార్గ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

అయితే చాలా మంది వ్యాయామం చేయ‌డం ప్రారంభించిన కొద్ది స‌మ‌యంలోనే అల‌సిపోతుంటారు. వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాల నొప్పుల‌తో ఇబ్బందిప‌డుతుంటారు. దీంతో వారు ఎక్కువసేపు వ్యాయామం చేయ‌లేక‌పోతుంటారు. కండ‌రాల‌కు బ‌లాన్ని క‌లిగించి ఎక్కువ సేపు వ్యాయామం చేసేలా చేయ‌డంలో పుచ్చ‌కాయ ఎంతగానో సహాయ‌ప‌డుతుంది. ప్ర‌తిరోజూ వ్యాయామం చేసే వారు పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ సేపు వ్యాయామం చేయ‌గ‌ల‌రు. పుచ్చ‌కాయ‌లో సిట్రిలిన్ , కుకిర్బిటాసిన్ ఇ అనే ర‌సాయ‌నాలు ఉంటాయి. ఇవి కండ‌రాల బ‌లాన్ని పెంచ‌డానికి, కండ‌రాలు త్వ‌ర‌గా అల‌సిపోకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. వ్యాయామాలు చేసే వారు పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా అల‌సిపోకుండా ఉంటారు.

do you know these interesting facts about Watermelon
Watermelon

కండ‌రాల నొప్పులు త‌లెత్త‌కుండా ఉంటాయి. అలాగే పుచ్చ‌కాయ‌లో మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి వ్యాయామం చేసిన త‌రువాత కండ‌రాల‌ను సాధార‌ణ స్థితికి తీసుకు వ‌చ్చి మరుస‌టి రోజుకు కండ‌రాల‌ను సిద్ధం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అదేవిధంగా పుచ్చ‌కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. వ్యాయామాలు అధికంగా చేసేవారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం డిహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే పుచ్చ‌కాయ‌లో క్యాల‌రీలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. 100 గ్రాముల పుచ్చ‌కాయ‌లో 16 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ఉంటుంది. క‌నుక దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు పెర‌గ‌కుండా కూడా ఉంటారు. ప్ర‌తిరోజూ వ్యాయామం చేసేవారు, ఆట‌లు ఎక్కువ‌గా ఆడేవారు మాంసం,పాలు, గుడ్లు తీసుకుంటే స‌రిపోతుంది అని అభిప్రాయ ప‌డుతూ ఉంటారు.

వీటితో పాటు పండ్ల‌ను అందులోను ప‌చ్చ‌కాయ లాంటి లోక్యాల‌రీ పండ్ల‌ను కూడా తీసుకోవాలి. కండ‌రాల ఒత్తిడిని, నొప్పుల‌ను త‌గ్గించి కండ‌రాల‌కు విశ్రాంతిని క‌లిగించి కండ‌రాల‌కు బ‌లాన్ని చేకూర్చ‌డంలో పుచ్చ‌కాయ మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక వ్యాయామం చేసేట‌ప్పుడు త్వ‌ర‌గా అల‌సిపోయే వారు పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts