Pine Apple : పైనాపిల్ ను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

Pine Apple : ఈ కాలంలో ఎంతో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.  ఈ పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. పైనాపిల్ తినడానికి తీయని, పుల్లని రుచి కలిగి ఉండటం వల్ల ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి.

eat Pine Apple everyday for these health benefits

ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్ లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి విటమిన్-సి ఎంతగానో దోహదపడుతుంది.

మన శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా పైనాపిల్ ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. పైనాపిల్ లో ఉండే బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్‌.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది.

మధుమేహం, గుండె పోటు సమస్యలు, దంతాల సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ ఎంతో ప్రయోజనకరం. విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అదేవిధంగా బాలింతలు పైనాపిల్ ను తినడం వల్ల పిల్లలకు కావలసినంత పాల ఉత్పత్తి జరుగుతుంది.

పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts