సిరి ధాన్యాలు.. వీటినే చిరు ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అద్భుతమైన ఆహార పదార్థాలు అనే చెప్పవచ్చు. వీటిల్లో సహజసిద్ధమైన పీచు పదార్థం ఉంటుంది. నిత్యం మనకు 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) అవసరం అవుతుంది. అయితే సిరి ధాన్యాల్లో దేన్ని తిన్నా సరే మనకు కావల్సినంత పీచు పదార్థం లభిస్తుంది. అందుకనే వీటిని సూపర్ ఫుడ్స్‌గా చెబుతున్నారు.
సాధారణంగా వరి, గోధుమలకు పొట్టు తీసే తింటారు. కనుక వాటిల్లో పీచు పదార్థం దాదాపుగా నశిస్తుంది. కానీ సిరిధాన్యాల్లో పీచు పదార్థం అలా కాదు. వాటి లోపలి పొరల్లోనూ ఉంటుంది. అందువల్ల సిరి ధాన్యాలను తినడం వల్ల మనకు పుష్కలంగా పీచు పదార్థం లభిస్తుంది.
సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచు పదార్థంలోపాటు 12 శాతం ప్రోటీన్లు కూడా ఉంటాయి. గర్భీణలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. గర్భంలో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యంగా కొర్రలు పనిచేస్తాయి. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛ వస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి మూర్ఛ పిల్లల్లో కొన్నేళ్ల వరకు అలాగే ఉంటుంది. కానీ కొర్రలను తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే నరాల బలహీనత, చర్మ సమస్యలు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు కొర్రలు తింటే ఉపయోగం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
రక్త శుద్ధికి, ఎముకల్లో గుజ్జు ఏర్పడేందుకు, ఉన్న గుజ్జు సమర్థవంతంగా పనిచేసేందుకు, ఆస్తమా, మూత్ర పిండాల వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, పేగులు, థైరాయిడ్, గొంతు సమస్యలు, క్లోమ గ్రంథి సమస్య, కాలేయ వ్యాధులు, కాలేయ క్యాన్సర్, డయాబెటిస్, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ తదితర సమస్యలు ఉన్నవారు అరికలను తింటే ప్రయోజనం ఉంటుంది.
సామలను నిత్యం తీసుకోవడం వల్ల స్త్రీలు, పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. అంటే సంతాన లోపం సమస్య ఉన్నవారు వీటిని తింటే మంచిది. స్త్రీలలో వచ్చే పీసీవోడీ (పీసీఓఎస్) సమస్య తగ్గుతుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. లింఫ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మెదడు, గొంతు సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనాలను పొందవచ్చు.
థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు ఉన్నవారు వీటిని తింటే మంచిది. డయాబెటిస్ వ్యాధి తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్‌లు శుభ్రమవుతాయి. కామెర్లు తగ్గుతాయి. లివర్, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించడానికి సహాయపడతాయి.
మొలలు, భగంద్రం, మూలశంక, ఫిషర్స్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, జీర్ణాశయం, పేగులు, చర్మ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.