Poor Eyesight : పూర్వం రోజుల్లో మన పెద్దలకు వృద్ధాప్యం వచ్చాక కూడా కళ్లు బాగానే కనిపించేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లలు సైతం కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు అస్తవ్యవస్తమైన జీవన విధానం, పోషకాహార లోపం, డిజిటల్ తెరలను ఎక్కువగా చూడడమే కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పండ్లను పిల్లలే కాదు, పెద్దలు కూడా తినాలి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడ్డాక కంటి జబ్బు రాకుండా ఉంటాయి. అలాగే కంటి సమస్యలు తగ్గుతాయి. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ల గురించి అందరికీ తెలిసిందే. ఇవి మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. క్యారెట్లు మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో బీటా కెరోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో రేచీకటి సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే కంటి ఆరోగ్యం కోసం పాలకూరను కూడా తినాలి. ఇందులో లుటీన్, జియాజాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డిజిటల్ తెరల నుంచి వచ్చే బ్లూ లైట్‌తోపాటు సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. పాలకూరలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతోపాటు విటమిన్ ఇ, బీటా కెరోటిన్ కూడా ఉంటాయి. ఇవి కళ్లను సంరక్షిస్తాయి.
క్యాప్సికంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కళ్లను రక్షిస్తుంది. కంటి నాడులను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో వయస్సు మీద పడిన తరువాత కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి. క్యాప్సికంను మనం సలాడ్స్, సూప్‌లలో తినవచ్చు. లేదా పచ్చిగా కూడా తినవచ్చు. అదేవిధంగా బ్రొకలీలో ఉండే లుటీన్, జియాజాంతిన్, విటమిన్ సి అనే పోషకాలు కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. అలాగే కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి.
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ దుంపల్లో విటమిన్ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కంటి నాడులను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో వయస్సు మీద పడిన తరువాత కంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఉసిరికాయల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల వీటిని తింటున్నా లేదా వీటి జ్యూస్‌ను తాగినా కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
సిట్రస్ పండ్లు అయిన నారింజ, నిమ్మ, సీజనల్ పండ్లను తినాలి. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇతర బెర్రీల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. దీంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు కంటి చూపును కూడా పెంచుకోవచ్చు. దీంతో కొంత కాలం తరువాత కళ్లద్దాలను కూడా తీసి అవతల పడేస్తారు.