Kokum Fruit : కోకుమ్ ని కొంకణి కూరల్లో పులుపు కోసం ప్రధాన పదార్థంగా వాడతారు. దీనిని గార్సినియా ఇండికా అని పిలుస్తారు. కోకుమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కోకుమ్ ను వృక్షమాలా అని కూడా పిలుస్తారు. గార్సినియా ఇండికా మొక్క భారతదేశంలోని పశ్చిమ కనుమలలో మరియు అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా కనిపిస్తుంది. కోకుమ్ ని ఆహారంగా తీసుకోవటం వలన ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని కొవ్వుని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. కోకుమ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కోకుమ్ ని జ్యూస్‌గా తీసుకోవటం వలన శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
కోకుమ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల కోకుమ్ 60 కేలరీల శక్తిని అందిస్తుంది. కోకుమ్‌లో కేలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కోకుమ్ 2 గ్రాముల ఫైబర్‌ను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మరియు జింక్ కూడా ఉన్నాయి. కోకుమ్‌లో ఎసిటిక్ యాసిడ్ మరియు హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. అందువల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ పండులో అధికంగా యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ పండు అనేక బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్‌లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గార్సినియా ఇండికా సహాయంతో పేగు అలెర్జీలను తగ్గించవచ్చని అధ్యయనాలు కూడా నిరూపించాయి.
కోకుమ్‌లో HCA (హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని అణిచివేసే విధంగా పనిచేస్తుంది. కోకుమ్ బరువు తగ్గడంలో సహాయపడటానికి మరొక కారణం దాని అధిక ఫైబర్ కంటెంట్. ఒక గ్లాసు ఫ్రెష్ కోకుమ్ జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. కోకుమ్ పండు కార్బోహైడ్రేట్‌లను కొవ్వులుగా మార్చడాన్ని కూడా తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు నియంత్రణకు ఈ ఫలం అత్యంత ప్రభావవంతమైన పదార్థంగా పనిచేస్తుంది.
ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెదడును చురుకుగా ఉంచి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. కోకుమ్ అనేది పండు రూపంలో దొరుకుతుంది. అదేవిధంగా డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కోకుమ్ పండును తినటానికి తప్పకుండా ప్రయత్నం చేయండి.