Nuts : ఏయే న‌ట్స్‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Nuts : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. బాదం, పిస్తాపప్పు, వాల్‌న‌ట్స్‌, జీడిప‌ప్పు.. ఇలా ఎన్నో ర‌కాల న‌ట్స్ ను మ‌నం తిన‌వ‌చ్చు. అయితే ఒక్కో ర‌కానికి చెందిన న‌ట్స్ భిన్న ర‌కాల లాభాల‌ను అందిస్తాయి. వీటిని రోజూ అన్నింటినీ క‌లిపి గుప్పెడు మోతాదులో తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే ఏయే న‌ట్స్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

different types of Nuts and their health benefits
Nuts

1. పిస్తాప‌ప్పును తినడం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి.

2. జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. జీడిప‌ప్పులో కాల్షియం అధికంగా ఉంటుంది. క‌నుక ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

3. బాదంపప్పును తిన‌డం వ‌ల్ల శ‌ర‌రీంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మెద‌డు చురుగ్గా ఉంటుంది. చిన్నారుల్లో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగి చ‌దువుల్లో రాణిస్తారు. మెగ్నిషియం వీటిలో అధికంగా ఉంటుంది క‌నుక నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. వాల్‌న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. క‌నుక గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ల‌భిస్తాయి. క‌నుక రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. వేరుశెన‌గ‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఫైబ‌ర్‌, ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts