జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..?

మ‌న‌కు తినేందుకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. నిజానికి అంద‌రూ బాదం ప‌ప్పు గురించి ఎక్కువ‌గా మాట్లాడ‌తారు కానీ జీడిప‌ప్పు గురించి ఎవ‌రూ నోరు మెద‌ప‌రు. అయితే జీడిపప్పులోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగానే ఉంటాయి. మ‌న‌కు ఇత‌ర న‌ట్స్ లాగానే జీడిప‌ప్పు కూడా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీన్ని భార‌తీయులు ఎంతో కాలం నుంచి ప‌లు కూర‌ల్లో పేస్ట్ రూపంలో వేస్తున్నారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక కొంద‌రు జీడిప‌ప్పును నెయ్యిలో వేయించుకుని తింటారు. అలాగే కొంద‌రు అలాగే వేయించి ఉప్పు, కారం చ‌ల్లుకుని తింటారు. అయిన‌ప్ప‌టికీ.. వీటిని ఎలా తిన్నా.. ఇవి మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తాయి. వీటిని సూప‌ర్ హెల్తీ ఫుడ్‌గా పిలుస్తారు. అయితే వీటిని ఎవ‌రు తిన్నా స‌రే.. మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. ఇక జీడిప‌ప్పులో ఉండే పోష‌కాల విష‌యానికి వ‌స్తే…

jeedipappu benefits telugu

30 గ్రాముల జీడిప‌ప్పు ద్వారా మ‌న‌కు 155 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే 9.2 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 5.1 గ్రాముల ప్రోటీన్లు, సూక్ష్మ మోతాదులో విట‌మిన్ ఇ, బి6, విట‌మిన్ కె10, కాల్షియం ల‌భిస్తాయి. జీడిప‌ప్పులో జింక్‌, మెగ్నిషియం, కాప‌ర్‌, పాస్ఫ‌ర‌స్‌, ఫోలిక్ యాసిడ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి అనేక రకాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

1. గుండె ఆరోగ్యానికి

జీడిప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. దీంతో విట‌మిన్లు ఎ, డి, ఇ, కెలు ఆ కొవ్వుల్లో క‌రుగుతాయి. అవి మ‌న శ‌రీరానికి అందుతాయి. అలాగే ఈ ప‌ప్పులో ఆరోగ్య‌క‌ర‌మైన పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి సూక్ష్మ మోతాదులో మ‌న‌కు అవ‌స‌రం అవుతాయి. దీంతో శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. అలాగే గుండె జ‌బ్బులు లేని వారికి ఆ జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

2. ర‌క్త‌హీన‌త‌కు

నిత్యం త‌గిన మోతాదులో జీడిప‌ప్పును తింటే ర‌క్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. దీంతో కాప‌ర్ కూడా త‌గ్గుతుంది. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. నిత్యం జీడిప‌ప్పును తినాలి. జీడిప‌ప్పులో కాప‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా చూస్తుంది. ఇత‌ర ర‌క్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

3. కంటి ఆరోగ్యానికి

క్యారెట్ల‌ను తిన‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే నిజానికి జీడిప‌ప్పు కూడా మ‌న కంటి ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం మ‌నం కాలుష్య భ‌రిత‌మైన వాతావ‌ర‌ణంలో ఎక్కువ‌గా తిరుగుతున్నాం. దీంతో కళ్ల‌పై భారం పడి కంటి వ్యాధులు వ‌స్తున్నాయి. అయితే జీడిప‌ప్పును నిత్యం తింటే అందులో ఉండే జియా జాంతిన్ అన‌బ‌డే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ కంటి రెటీనాపై ఓ సుర‌క్షిమైన పొర‌ను ఏర్పాటు చేస్తుంది. దీంతో క‌ళ్లు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. ముఖ్యంగా సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత (అల్ట్రావ‌యొలెట్‌) కిర‌ణాల ప్ర‌భావం క‌ళ్ల‌పై ప‌డ‌కుండా ఉంటుంది.

4. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు

జీడిప‌ప్పు నుంచి తీసే నూనె మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ఈ నూనెలో జింక్‌, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. అలాగే చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి.

5. అధిక బ‌రువు

జీడిపప్పులో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి.. వాస్త‌వ‌మే.. కానీ.. నిజానికి ఇవి ఇత‌ర ప‌దార్థాల్లా బ‌రువును పెంచ‌వు.. త‌గ్గిస్తాయి. రీసెర్చ‌ర్లు కూడా ఇదే చెబుతున్నారు. ఎందుకంటే.. జీడిప‌ప్పు వృక్ష సంబంధ‌మైంది. జంతు సంబంధ ప‌దార్థాల్లో ఉండే కొవ్వు మ‌న బ‌రువును పెంచుతుంది. కానీ వృక్ష సంబంధ ప‌దార్థాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. క‌నుక ఇవి మ‌న బ‌రువును త‌గ్గిస్తాయి. జీడిప‌ప్పులో పాలీ, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. అలాగే ఈ ప‌ప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజాన్ని పెంచుతాయి. దీంతో అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అయితే జీడిపప్పును తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే.. దాన్ని అలాగే నేరుగా తినాలి. వేయించ‌కూడ‌దు. అందులో ఉప్పు, కారం వంటివి చ‌ల్ల‌కూడ‌దు. నేరుగా తింటేనే ముందు చెప్పిన లాభం క‌లుగుతుంది.

6. వెంట్రుక‌ల‌కు

జీడిప‌ప్పును నిత్యం తిన్నా లేదా ఆ ప‌ప్పు నుంచి తీసిన నూనెను నేరుగా వాడినా వెంట్రుక‌లు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. జీడిప‌ప్పులో కాప‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల్లో ఉండే మెల‌నిన్ అనే పిగ్మెంట్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts