Peanuts : వేరుశనగలు.. పల్లీలు.. పేరు ఏదైనప్పటికి ఇవి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పల్లీలను వేయించి, ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ రకాల కూరల తయారీలో, పచ్చళ్ల తయారీలో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి మూడు రకాల వ్యాధులు ఉన్న వారు మాత్రం వీటిని ఆహారంగా తీసుకోకూడదు. అయితే ఎటువంటి సమస్యలు ఉన్న వారు పల్లీలను ఆహారంగా తీసుకోకూడదు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలను పేదవారి బాదం పప్పు అని కూడా అంటారు. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో లభిస్తాయి.
చలికాలంలో వేరుశనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుండి మనల్ని వెచ్చగా ఉంచుతాయి. పల్లీల్లో ఉండే మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రైఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. అయితే డ్రైఫ్రూట్స్ అధిక ధరలతో కూడుకుని ఉంటాయి. వీటిని అందరూ కొనుగోలు చేయలేరు. అలాంటి వారు పల్లీలను కొనుగోలు చేసి తీసుకోవడం వల్ల ఇతర డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు. పల్లీలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పల్లీలను ఉడికించి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. చాలా మంది వీటిని నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు. వేయించిన పల్లీలు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.
అయితే పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికి వీటిని గుప్పెడు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. పల్లీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అలర్జీలు, దురదలు, నోటి వాపు, చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా సరిగ్గా జరగదు. అలాగే పల్లీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకం, గుండెల్లో మంట వంటి సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంది. కనుక ఎసిడిటీ సమస్య ఉన్న వారు పల్లీలను ఎక్కువగా తీసుకోకూడదు. అదే విధంగా కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా వేరుశనగలను తీసుకోకపోవడమే మంచిది.
వీటిలో ఉండే లెక్టిన్ అనే పదార్థం శరీరంలో నొప్పులను, మంటను పెంచే గుణం కలిగి ఉంటుంది. కనుక కీళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే కాలేయ సమస్యలు ఉన్న వారు కూడా పల్లీలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆప్లటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. ఈ టాక్సిన్ కాలేయానికి తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. దీంతో కాలేయ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పల్లీలను తీసుకున్న తరువాత నీటిని తాగకూడదు. ఇలా నీటిని తాగడం వల్ల పల్లీలల్లో ఉండే కొవ్వు ఆహార నాళాన్ని పట్టుకుని ఉంటుంది.
ఇలా పేరుకుపోయిన కొవ్వు ఆహారనాళంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వీటిని తిన్న తరువాత నీటిని తాగడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పల్లీలు ఆరోగ్యానికి మేలు చేసేవైనప్పటికి వీటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మనం వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారు, కీళ్ల నొప్పులు ఉన్న వారు, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.