Almonds : బాదంప‌ప్పు 5 గింజ‌లు నాన‌బెట్టి.. ఉద‌యాన్నే వాటిని పొట్టు తీసి తినండి.. ముఖ్యంగా పురుషులు..

Almonds : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పును ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వీటిని చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. బాదం ప‌ప్పును నేరుగా తిన‌డం కంటే వాటిని రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిపై పొట్టును తీసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధికంగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

బాదం ప‌ప్పుపై ఉండే పొట్టులో టానిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది బాదంలో ఉండే పోష‌కాల‌ను పూర్తిగా మ‌న శ‌రీరానికి అంద‌కుండా అడ్డుప‌డుతుంది. అంతేకాకుండా బాదం ప‌ప్పుల‌ను పొట్టు తీసి తిన‌డం వ‌ల్ల తేలిక‌గా జీర్ణ‌మ‌వుతాయి. నాన‌బెట్టిన బాదం ప‌ప్పులో లైప‌స్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొవ్వును క‌రిగించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. రోజూ 5 బాదం గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే పొట్టి తీసి తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

take soaked Almonds at breakfast for these benefits
Almonds

బాదం గింజ‌ల్లో విట‌మిన్ ఇ, ఫైబ‌ర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు కాల్షియం, జింక్, ఫాస్ప‌ర‌స్, మెగ్నిషియం వంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా పొట్టు తీసిన బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్ల‌ల‌కు బాదంప‌ప్పును ఇవ్వ‌డం వ‌ల్ల వారి ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉండ‌డంతోపాటు చ‌దువులో కూడా చురుకుగా ఉంటారు. బాదం ప‌ప్పును రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

అంతేకాకుండా ఈ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వ‌య‌సు పైబ‌డిన వారు బాదం గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. వీటిలో స‌మృద్ధిగా ఉండే కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా బాదం గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బాదం గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు, వృద్ధాప్య ఛాయ‌లు తొల‌గిపోయి చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా తయార‌వుతుంది.

అంతేకాకుండా బాదం ప‌ప్పుకు లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచే శ‌క్తి కూడా ఉంటుంది. రోజూ నాన‌బెట్టిన బాదం గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతోపాటు పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా బాదం నూనె కూడా మ‌న‌కు ఎంతో ప‌యోగ‌ప‌డుతుంది. బాదం నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు త‌గ్గి న‌వ య‌వ్వ‌నంగా క‌న‌బ‌డుతుంది. అంతేకాకుండా ఈ నూనెను రాసుకోవ‌డం వల్ల కండ‌రాల నొప్పులు కూడా త‌గ్గుతాయి.

ఈ విధంగా బాదం గింజ‌ల‌తోపాటు బాదం నూనె కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. నాన‌బెట్టి పొట్టు తీసిన బాదం ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts