పోష‌కాహారం

Papaya : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Papaya : ఆరోగ్యానికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అందుకని, చాలామంది బొప్పాయిని రెగ్యులర్ గా తింటూ ఉంటారు. పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా మనకి ఇది అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది, ఈజీగా లభిస్తుంది. బొప్పాయి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బొప్పాయిని తీసుకోవడం వలన లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి.

బొప్పాయి పండు ని తీసుకుంటే, ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడే వాళ్ళు, బొప్పాయిని తీసుకోవడం మంచిది కాదు. డాక్టర్ని సంప్రదించి, ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. ఈ సమస్యలు ఉన్నవాళ్లు బొప్పాయిని తీసుకోవడం వలన వాపు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉన్నవాళ్లు బొప్పాయిని తీసుకోవడం వలన మొటిమలు, తల తిరగడం, వాపు మొదలైన సమస్యలు వస్తాయి.

people with these health problems should not eat papaya

గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండ్లను తినకూడదు. బొప్పాయి కడుపులో పిండానికి హాని చేస్తుంది. బొప్పాయి గర్భస్రావంని కూడా కలిగిస్తుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు బొప్పాయి కి దూరంగా ఉండాలి. కామెర్లతో బాధపడే వాళ్ళు, డాక్టర్లు సలహా మేరకు బొప్పాయిని తీసుకోవాలి. శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు కూడా డాక్టర్ల సలహా మేరకు బొప్పాయిని తీసుకోవడం మంచిది.

ఎక్కువగా బొప్పాయి పండుని తీసుకుంటే, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. గుండె సమస్యలు ఉన్నవాళ్లు బొప్పాయిని ఎక్కువ తీసుకోకూడదు. షుగర్ పేషెంట్లు, బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళు, బొప్పాయిని తీసుకోకుండా ఉండడం మంచిది. అదే విధంగా బొప్పాయి, అరటిపండు కలిపి తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

Share
Admin

Recent Posts