గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందడానికి అవుతుంది. గర్భధారణ సమయంలో గుమ్మడి గింజలు తీసుకుంటే గర్భిణీల ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో గర్భిణీలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పోషకాహారాన్ని మాత్రమే గర్భిణీలు తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఆరోగ్యం పాడవతుంది. బిడ్డకి కూడా ఇబ్బందులు కలగవచ్చు.
గుమ్మడి గింజలని గర్భిణీలు తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజూ ఒక టీస్పూన్ గుమ్మడి గింజల్ని గర్భిణీలు తీసుకుంటే మంచిది. ఈ గింజలలో జింక్, ఐరన్ తోపాటుగా మెగ్నీషియం కూడా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇవన్నీ కూడా గర్భిణీలకు ఎంతో ముఖ్యమైనవి. అంతేకాకుండా గుమ్మడి గింజల్లో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది.
కనుక పిండం అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. జింక్.. కణాల పెరుగుదల అలాగే విభజనలో ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థ అభివృద్ధిలో కూడా జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరకణాలకి ఆక్సిజన్ తీసుకెళ్లేందుకు ఐరన్ చాలా అవసరం. పైగా గర్భధారణ సమయంలో కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి. పెరుగుతున్న పిండం అభివృద్ధి చెందాలంటే ఆక్సిజన్ అవసరం. గర్భిణీలు చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.
కానీ గర్భిణీలు గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య రాదు. గర్భిణీలు గుమ్మడి గింజలను తీసుకుంటే మెగ్నీషియం కూడా బాగా అందుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలని గుమ్మడి గింజలు కంట్రోల్ లో ఉంచుతాయి. గర్భిణీలకి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గర్భిణీలు ఫైబర్ ఉండే ఈ గింజల్ని తీసుకుంటే ఇలాంటి బాధలు ఉండవు. పేగు కదలికలని నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా గర్భిణీలు గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొంది ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.