Sesame Seeds Milk : నువ్వుల‌తో పాల‌ను ఇలా త‌యారు చేసుకుని తాగండి.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..!

Sesame Seeds Milk : ఆవు పాలు.. గేదె పాలు.. ఏ పాలు తాగినా స‌రే మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు పాల‌లో ఉంటాయి. క‌నుక పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అయితే కొంద‌రు మాత్రం పాల‌ను తాగ‌లేక‌పోతుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ప‌శువుల ద్వారా వ‌చ్చే పాల‌ను తాగ‌లేక‌పోతే మ‌న‌కు అందుబాటులో ఉండే నువ్వుల ద్వారా త‌యారు చేసే పాల‌ను అయినా తాగాలి. ఈ పాల‌తోనూ మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక నువ్వుల పాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sesame Seeds Milk  prepare in this way very healthy
Sesame Seeds Milk

100 గ్రాముల నువ్వుల‌ను తీసుకుని ఒక‌టిన్న‌ర లీట‌ర్ల నీటిలో సుమారుగా 4, 5 గంట‌ల పాటు బాగా నాన‌బెట్టాలి. త‌రువాత నువ్వుల‌ను తీసుకుని నీళ్లు పోస్తూ మెత్త‌ని పేస్ట్‌లా ప‌ట్టుకోవాలి. పేస్ట్ చేశాక మ‌ళ్లీ నీళ్ల‌ను పోసి ఇంకా వ‌దులుగా చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో వేసి బాగా పిండుతూ ఉండాలి. దీంతో తెల్ల‌ని పాలు వ‌స్తాయి. ఇలా నువ్వుల‌ను బాగా పిండి పాలు తీయాలి. ఈ పాల‌ను మ‌ర‌గ‌బెట్టాల్సిన అవ‌స‌రం లేదు. నేరుగా తాగ‌వ‌చ్చు. వేడిగా తాగాల‌నుకుంటే కాస్తంత మ‌ర‌గ‌బెడితే చాలు.

నువ్వుల పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌శువుల పాల‌కు దాదాపుగా స‌మాన‌మైన కాల్షియం మ‌న‌కు నువ్వుల పాల‌లోనూ ల‌భిస్తుంది. ప‌శువుల పాల‌ను తాగ‌లేని వారు, ఆ పాలు అంటే అల‌ర్జీ ఉన్న‌వారు.. నువ్వుల పాల‌ను భేషుగ్గా తాగ‌వ‌చ్చు. దీంతో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. నువ్వుల పాల‌లో ఉండే కాల్షియం మ‌న ఎముక‌ల‌ను, దంతాల‌ను దృఢంగా మారుస్తుంది.

నువ్వుల పాల‌లో ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది. సాధార‌ణ పాల‌లో ఇది ఉండ‌దు. క‌నుక నువ్వుల పాల‌ను తాగితే ఫైబ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. నువ్వుల పాల‌లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మాంసాహారం తిన‌ని వారికి నువ్వుల పాలు బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. మాంసంతో స‌మాన‌మైన ప్రోటీన్లు ఈ పాల ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. క‌నుక మాంసం తిన‌క‌పోతే ఈ పాల‌ను తాగాలి. దీని వ‌ల్ల ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ల‌భిస్తాయి.

నువ్వుల పాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక‌మే. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు నువ్వుల పాల‌ను తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. నువ్వుల పాల‌ను పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకుని రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts