Lemon : నిమ్మకాయ.. ఇది మనందరికీ తెలుసు. దీనిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మకాయను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తాం. నిమ్మ కాయలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయని.. వీటిలో గింజలు తప్ప మిగిలిన భాగం అంతా అమృతతుల్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒక నిమ్మ పండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వందేడ్ల వరకు ఎటువంటి అనారోగ్యం కూడా మన దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ కాయ పచ్చడిని, నిమ్మ పులుసుతో చారు వంటి వాటిని చేసుకుని తినడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందని వారు చెబుతున్నారు. దీనిని సంస్కృతంలో నింబా అని హిందీలో నీంబూ అని పిలుస్తారు. నిమ్మలో అనేక జాతులు ఉంటాయి.
నిమ్మ పుండు పుల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు. వాత రోగాలను పోగొట్టడంలో నిమ్మకాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరచడంతోపాటు పొట్టలో ఉండే క్రిములను హరిస్తుంది. నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మకాయను మించిన ఔషధం లేదని నిపుణులు చెబుతున్నారు. పది నిమ్మకాయల నుండి రసాన్ని తీసి దానిలో తగినంత చక్కెరను వేసి తాగితే గంజాయి మత్తు, నల్ల మందు మత్తు, సర్ప విషం హరించుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసంలో విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా నిమ్మకాయల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. నిమ్మకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని వేసి కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయి. రోజూ ఈ నీటిని తాగడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు కూడా బయటకు పోతాయి. ఈ నీటిని తాగడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. చర్మం పై ఉండే మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రోజూ నిమ్మ రసాన్ని నేరుగా లేదా గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
రోజూ నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. నిమ్మ రసం కలిపిన నీటిలో చేతులను ఉంచితే చేతులు మృదువుగా తయారవుతాయి. మందార ఆకులను ముద్దగా నూరి అందులో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నిమ్మ రసానికి సమానంగా పాలను కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. వాంతులతో బాధపడే వారు రసం తీసిన నిమ్మ తొక్కలను ఎండ బెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి తగినంత తేనెను కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి.
జిగట విరేచనాలతో బాధపడే వారు రోజూ ఉదయం రెండు నిమ్మకాయల నుండి తీసిన రసంలో 3 చుక్కల వంటాముదాన్ని కలిపి తీసుకోవడం వల్ల జిగట విరేచనాలు తగ్గుతాయి. నిద్రలేమి సమస్యతో బాధ పడే వారు రోజుకు రెండు పూటలా నిమ్మ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులతో బాధ పడే వారు నిమ్మ కాయ తొక్కలను, ఉప్పును నీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా అయిన తరువాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల నొప్పులు, అలసట తగ్గుతాయి. 5 నిమ్మ కాయల నుండి తీసిన రసంలో అర లీటర్ కొబ్బరి నూనెను కలిపి చిన్న మంటపై నూనె మిగిలే వరకు మరిగించి చల్లగా అయిన తరువాత నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ను తలకు రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. తలలో ఉండే పేలతోపాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు నల్లగా మారుతుంది.
నిమ్మ కాయ రసంలో నీళ్లు, పంచదార కలుపుకుని రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగడం వల్ల చర్మం పై దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఈ విధంగా నిమ్మ కాయలు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడేసే ఔషధంగా పని చేస్తాయని, అంతేకాకుండా నిమ్మకాయలను ఉపయోగించని భోజనం భోజనమే కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.