Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Bottle Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో సొరకాయలు ఒకటి. వీటిని కొందరు ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినా ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి సొరకాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

1. మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. దీని జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో తాగుతుండాలి. దీంతో సొరకాయల్లో ఉండే పీచు పదార్థం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఆయుర్వేద ప్రకారం సొరకాయలను పెరుగుతో తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది.

2. అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఇబ్బందిగా మారింది. అయితే సొరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్‌ మోతాదులో తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండు కొవ్వు కరిగిపోతుంది.

3. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ సొరకాయలను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

4. సొరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

5. సొరకాయల్లో కోలిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

6. బీపీని నియంత్రించడంలోనూ సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే హైబీపీ తగ్గుతుంది. సొరకాయల్లో సోడియం, పొటాషియం, ఇతర ముఖ్యమైన మినరల్స్‌ ఉంటాయ. అందువల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది.

7. మధుమేహం సమస్య ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి సొరకాయలు ఎంతగానో మేలు చేస్తాయి.

8. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగితే మంచిది. లివర్‌ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోయి లివర్‌ శుభ్రంగా మారుతుంది.

9. సొరకాయ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే మానసిక సమస్యలు పోతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది.

10. ఆస్తమా, కామెర్లు వంటి సమస్యలు ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగితే ప్రయోజనం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.

Share
Admin

Recent Posts