High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం హైబీపీ అని చెప్ప‌వ‌చ్చు. బీపీ వ‌ల్లే చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌ల మూలంగా ఎక్కువ మంది చ‌నిపోతున్నారు. అయితే నిజానికి బీపీ ఎంత ఉండాలి ? ఏ స్థాయిలో అది ఉంటే ఆరోగ్య‌క‌రం ? ఎంత స్థాయి దాటితే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

ప్ర‌స్తుతం చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ప‌ని ఒత్తిడి, ఇత‌ర సంద‌ర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిళ్లు, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఇతర అనారోగ్యాల కార‌ణంగా బీపీ స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అందుక‌నే హాస్పిట‌ల్‌కు మ‌నం వెళితే ముందుగా మ‌న‌కు బీపీ చెక‌ప్ చేస్తారు. అది స‌రిగ్గా ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

ఇక సాధారణంగా 120/80 రీడింగ్‌ ఉంటే నార్మల్ బీపీ అంటారు. ఇంత‌క‌న్నా బీపీ ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా అనారోగ్య సమస్యలు తప్పవు. క‌నుక‌ బీపీని కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేసుకోవాలి.

ఇక‌ 140/90 కంటే ఎక్కువగా ఉంటే హైబీపీ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. బీపీ ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. తక్కువైనా, ఎక్కువైనా సమస్యలు తప్పవు. బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉంటే.. హార్ట్ స్ట్రోక్స్ ఇతర సమస్యలు వస్తాయి. క‌నుక బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Admin

Recent Posts