అధిక బ‌రువు నుంచి కంటి చూపు దాకా.. క్యారెట్ల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..

మ‌న‌కు మార్కెట్‌లో క్యారెట్లు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇవి అంత ఎక్కువ ధ‌ర కూడా ఉండ‌వు. అందువ‌ల్ల వీటిని ఎవ‌రైనా స‌రే సుల‌భంగా తిన‌వ‌చ్చు. క్యారెట్లను నిజానికి పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు వీటిలో ఎన్నో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే క్యారెట్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

carrot health benefits in telugu

1. కంటి ఆరోగ్యానికి

కంటి చూపు స‌మ‌స్య, దృష్టి లోపాల‌తో స‌త‌మ‌తం అయ్యేవారికి క్యారెట్లు చ‌క్కని ప‌రిష్కారాన్ని అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి కంటి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. క్యారెట్ల‌లో లుటీన్‌, లైకోపీన్‌లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. రేచీకటి ఉన్న‌వారికి ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. దీంతో దృష్టి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

2. అధిక బ‌రువుకు

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూసేవారు నిత్యం త‌మ ఆహారంలో ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఆ విష‌యానికి వ‌స్తే క్యారెట్లు చ‌క్క‌గా ప‌నికొస్తాయి. వీటిల్లో సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్ లు రెండూ ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి కాకుండా ఉంటుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

3. జీర్ణ ప్ర‌క్రియ‌కు

క్యారెట్ల‌లో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్ మ‌న శ‌రీర జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. దీంతో తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. నిత్యం మ‌ల‌బద్ద‌కం ఉంటే ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది. విరేచ‌నం సాఫీగా అవుతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

4. కొలెస్ట్రాల్‌, గుండె ఆరోగ్యం

ర‌క్తా నాళాలు, నాళాల గోడ‌ల‌కు అంటి పెట్టుకుని ఉండే కొలెస్ట్రాల్‌ను క్యారెట్ల‌లోని ఫైబ‌ర్ త‌గ్గిస్తుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

5. హై బీపీ

క్యారెట్ల‌లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. దీని వ‌ల్ల హార్ట్ స్ట్రోక్స్‌, ఇత‌ర గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న వారు నిత్యం క్యారెట్ల‌ను తింటుంటే కొద్ది రోజుల్లోనే చ‌క్క‌ని ఫలితం క‌నిపిస్తుంది.

6. చ‌ర్మ సంర‌క్ష‌ణ

క్యారెట్ల‌లో బీటా కెరోటీన్‌, లుటీన్‌, లైకోపీన్‌లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చర్మానికి కాంతిని తెస్తాయి. చ‌ర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

7. రోగ నిరోధ‌క శ‌క్తి

క్యారెట్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విట‌మిన్ బి6, కె, పొటాషియం, పాస్ఫ‌ర‌స్‌లు ఉంటాయి. ఇవి ఎముక‌ల ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచి ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థను చురుగ్గా ప‌నిచేసేలా చేస్తాయి. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. క్యారెట్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. దీంతో బాక్టీరియా, వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

100 గ్రాముల ప‌చ్చి క్యారెట్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు లభించే పోష‌కాల వివ‌రాలు:

* క్యాల‌రీలు – 41

* ఫ్యాట్ – 0.2 గ్రాములు

* కార్బొహైడ్రేట్లు – 9.6 గ్రా.

* ఫైబ‌ర్ – 2.8 గ్రా.

* చ‌క్కెర – 4.7 గ్రా.

* ప్రోటీన్లు – 0.9 గ్రా.

* కాల్షియం – 33 మిల్లీగ్రాములు

* ఐర‌న్ – 0.30 మి.గ్రా.

* పొటాషియం – 320 మి.గ్రా.

* ఫోలేట్ – 19 మైక్రో గ్రా.

* నియాసిన్ – 0.983 మి.గ్రా.

* పాంటోథెనిక్ యాసిడ్ – 0.273 మి.గ్రా.

* పైరిడాక్సిన్ – 0.138 మి.గ్రా.

* రైబో ఫ్లేవిన్ – 0.058 మి.గ్రా.

* థ‌యామిన్ – 0.066 మి.గ్రా.

* విట‌మిన్ ఎ – 16706 ఐయూ

* విట‌మిన్ సి – 5.9 మి.గ్రా.

* విట‌మిన్ కె – 13.2 మైక్రో గ్రా.

* కాల్షియం – 33 మి.గ్రా.

* కాప‌ర్ – 0.045 మి.గ్రా.

* మెగ్నిషియం – 12 మి.గ్రా.

* మాంగ‌నీస్ – 0.143 మి.గ్రా.

* ఫాస్ఫ‌ర‌స్ – 35 మి.గ్రా.

* సెలీనియం – 0.1 మైక్రో గ్రా.

* జింక్ – 0.24 మి.గ్రా.

Admin

Recent Posts