మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో వంకాయలు ఒకటి. ఇవి మనకు భిన్న రకాల సైజులు, రంగుల్లో లభిస్తాయి. పర్పులు, గ్రీన్ కలర్‌లలో ఇవి లభిస్తాయి. కొన్ని గుండ్రంగా ఉంటాయి. కొన్ని పొడవుగా ఉంటాయి. అయితే ఎలా ఉన్నా సరే వంకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయల్లో ఉండే ఆంథోసయనిన్స్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు.
2. పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6లు వంకాయల్లో అధికంగా ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
4. వంకాయలను తరచూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ఎటాక్ లు రాకుండా కాపాడుకోవచ్చు. వంకాయలను తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
5. వంకాయల్లో పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతోడయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి వంకాయలు మేలు చేస్తాయని చెప్పవచ్చు.
6. వంకాయలను తరచూ తింటే హైబీపీ తగ్గుతుంది. అల్సర్లు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365