పోషకాల గని కాలిఫ్లవర్‌.. దీని వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు..

కాలిఫ్లవర్‌ను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ దీన్ని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. కాలిఫ్లవర్‌లో వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను తరచూ తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాలిఫ్లవర్‌ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of cauliflower

1. కాలిఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్‌ సి, కె, బి6, ఫోలేట్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను తరచూ తీసుకుంటే శరీరానికి పోషణ లభిస్తుంది.

2. కాలిఫ్లవర్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్యాన్నిస్తుంది. ఒక కప్పు కాలిఫ్లవర్‌ను తినడం వల్ల మనకు రోజువారీ కావల్సిన ఫైబర్‌లో పది శాతం లభిస్తుంది. దీని వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బాక్టీరియా వృద్ధి చెందుతుంది. వాపులు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాలిఫ్లవర్‌ను తరచూ తీసుకుంటే మలబద్దకం, ఇన్‌ఫ్లామేటరీ బొవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్, క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చు. కాలిఫ్లవర్‌లో ఉండే ఫైబర్‌ అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

3. కాలిఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్‌ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల పెద్ద పేగు, ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లు రావు. కాలిఫ్లవర్‌లో ఉండే కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు యాంటీ క్యాన్సర్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు రావు. కాలిఫ్లవర్‌లో అధికంగా ఉండే విటమిన్‌ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. అధిక బరువును తగ్గించుకోవాలని చూసేవారు కాలిఫ్లవర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణాశయాన్ని ఫుల్‌గా ఉంచుతుంది. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

5. కాలిఫ్లవర్‌లో కోలిన్‌ అధికంగా ఉంటుంది. ఇది కణాలకు శక్తినిస్తుంది. డీఎన్‌ఏ సంశ్లేషణకు, మెటబాలిజంను మెరుగు పరిచేందుకు పనిచేస్తుంది. లివర్‌లో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూస్తుంది. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. కాలిఫ్లవర్‌లో సల్ఫరఫేన్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ రాకుండా చూస్తుంది. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. బ్రెస్ట్‌, లుకేమియా, పాంక్రియాటిక్‌, మెలనోమా రాకుండా ఉంటాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బులు రావు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts