కూర‌గాయ‌లు

Purple Cabbage : కంటి చూపును పెంచుతుంది.. గుండె సేఫ్‌.. కొలెస్ట్రాల్, బీపీ త‌గ్గుతాయి..!

Purple Cabbage : మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్యాబేజీ కూడా ఒక‌టి. క్యాబేజీని చాలా మంది తిన‌లేరు. దీంతో వేపుడు లేదా 65 త‌యారు చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో క్యాబేజీని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే క్యాబేజీలో అనేక ర‌కాలు ఉంటాయి. వాటిల్లో ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీ ఒక‌టి. దీన్నే రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో ఆంథోస‌య‌నిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఆ క్యాబేజీ ఆ రంగులో ఉంటుంది. ఇక ఈ ఆంథోస‌య‌నిన్స్ మ‌న శ‌రీర క‌ణ‌జాలాన్ని ర‌క్షిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి క‌ణ‌జాలం సుర‌క్షితంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. దీని వ‌ల్ల ప్రాణాంత‌క క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. క‌నుక నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ క్యాబేజీలో ఉండే విట‌మిన్ కె గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం సుల‌భంగా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. దీంతో అధికంగా బ్లీడింగ్ కాకుండా ఆప‌వ‌చ్చు.

many wonderful health benefits of purple cabbage do not forget to take it

ఈ క్యాబేజీలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ క్యాబేజీలో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. ఈ క్యాబేజీలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే బ‌రువు త‌గ్గేందుకు ఫైబ‌ర్ ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో క్యాన్స‌ర్ పోరాట గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల క్యాన్స‌ర్లు ఉన్న‌వారు దీన్ని తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది.

ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు కూడా ఉంటాయి. క‌నుక గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను ఈ క్యాబేజీ త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో పూడిక‌లు ఏర్ప‌డ‌వు. ఇలా ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీతో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక త‌ర‌చూ దీన్ని తీసుకోవాలి.

Admin

Recent Posts