ఆధ్యాత్మికం

ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే శని ప్రభావమే.. జాగ్రత్త సుమా..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో శనికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. శని గ్రహాన్ని న్యాయానికి అధిపతిగా పండితులు అంటారు. మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని మంచి ఫలితాలను ఇస్తాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి శని చెడు ఫలితాలని కలిగిస్తాడు. వాళ్లని శిక్షిస్తాడని పండితులు అంటున్నారు. శని దేవుడు మంచి, చెడు కర్మ ఫలాలను మనకి ఇస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి జాతకంలో శని ఉచ్ఛ‌ స్థితి అనేది ఉండడం జరుగుతుంది. శని చెడు స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి.

అయితే శని ప్రభావం ఏ విషయాల మీద పడుతుంది అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం తీసుకోవడం లేదంటే మద్యం తీసుకోవాలని కోరిక ఎక్కువ ఉన్నట్లయితే శని ప్రభావం మీ మీద పడుతుంది. శని మహర్దశ ప్రారంభమవుతుందని మీరు గమనించాలి. మాంసాహారం మానేసి శాకాహారం తింటే శని ప్రభావం తగ్గుతుందట. మీ అరచేతి రంగు మారిపోవడం మొదలైతే శని ప్రభావం పడుతున్నట్లు గమనించాలి. నీలం రంగులోకి అరచేతి మారిపోయి నల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి.

lord shani effect will be like this

అలా జరిగితే శని మీపై కోపంతో ఉన్నట్లు మీరు గమనించాలి. ఎప్పుడైనా మీ పాదరక్షలను ఎవరైనా దొంగలిస్తే అది కూడా శని ప్రభావం అని తెలుసుకోవాలి. శని అనుగ్రహం కోసం శనివారం రోజు నల్లని రంగులో ఉండే పాదరక్షలను దానం చేయాలి. ఇదివరకు ఉపయోగించిన చెప్పులని ఇవ్వకూడదు. కొత్తవి ఇవ్వాలి. ఇంట్లో కానీ ఫ్యాక్టరీలో లేదంటే దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగితే అది శని ఆగ్రహం అని గ్రహించండి. ఒంట్లో సడన్ గా ఏమైనా సమస్యలు వస్తే కూడా శని చెడు స్థితికి కారణమని మీరు గ్రహించాలి. మీ జీవిత భాగస్వామితో సమస్యలు వస్తున్నా కూడా అది శని ప్రభావం అని గ్రహించాలి.

Admin

Recent Posts