Sweet Potatoes : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో చిలగడదుంపలు ఒకటి. కొందరు వీటిని కందగడ్డలు అని కూడా పిలుస్తారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. అయితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. చిలగడదుంపలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చిలగడదుంపల్లో అనేక పోషకాలు ఉంటాయి. పోషకాల గనిగా దీన్ని చెప్పవచ్చు. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎ, సి, బి6, మాంగనీస్, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, రాగి, నియాసిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
2. చిలగడదుంపలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అధిక బరువు ఉన్నవారు చిలగడదుంపలను రోజూ తింటుంటే బరువు తగ్గడం తేలికవుతుంది.
3. చిలగడదుంపల్లో ఆంథోసయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
4. చిలగడదుంపల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగు పడి కళ్లద్దాలను వాడాల్సిన అవసరం తగ్గుతుంది. కళ్లద్దాలను మీరే పక్కన పడేస్తారు. అంతలా ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
5. చిలగడదుంపల్లోని ఆంథోసయనిన్స్ మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయి.
6. చిలగడదుంపలలో విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
7. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
చిలగడదుంపలను రోజుకు ఒకటి చొప్పున ఉడకబెట్టి దానిపై కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని సాయంత్రం స్నాక్స్ సమయంలో తినాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.