Broccoli : బ్రొకొలిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Broccoli : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బ్రొకొలి ఒక‌టి. ఇది కాస్త ధ‌ర ఎక్కువ‌గానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఇది అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌మనే చెప్పాలి. బ్రొకొలి వ‌ల్ల మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇది చాలా ఆరోగ్య‌వంత‌మైన కూర‌గాయ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బ్రొకొలి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take Broccoli daily for these amazing benefits
Broccoli

1. బ్రొకొలిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే పాలిఫినాల్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే బ్రొకొలిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐర‌న్‌, సెలీనియం, విట‌మిన్లు , సి కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.

2. బ్రొకొలిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. త‌ర‌చూ బ్రొకొలిని తీసుకుంటే షుగ‌ర్ నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు కూడా.

3. బ్రొకొలిలో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుతాయి. క‌నుక ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారికి బ్రొకొలి ఎంత‌గానో మేలు చేస్తుంది. వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. బ్రొకొలిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5. శ‌రీరంలో నొప్పులు, వాపులు అధికంగా ఉన్న‌వారు బ్రొకొలిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి బ్రొకొలి ఎంత‌గానో మేలు చేస్తుంది.

ఇక బ్రొకొలిని నేరుగా తిన‌వ‌చ్చు. దీన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక మోస్త‌రుగా నీళ్లు పోసి శుభ్రం చేయాలి. త‌రువాత పెనంపై కాస్త నెయ్యి వేసి ఆ బ్రొకొలి ముక్క‌ల‌ను వేసి కాస్త వేయించాలి. ఎక్కువ సేపు ఉంచ‌కూడ‌దు. ఇలా త‌క్కువ మొత్తంలో బ్రొకొలి ముక్క‌ల‌ను వేయించుకుని అలాగే తిన‌వ‌చ్చు. దీన్ని 100 గ్రాములు తింటే మంచిది. లేదా బ్రొకొలితో జ్యూస్ చేసుకుని దాన్ని ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. అయితే బ్రొకొలిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటేనే అధికంగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Admin

Recent Posts