Tomato Juice : రోజూ బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్.. బీపీ, హార్ట్ ఎటాక్‌, షుగ‌ర్‌.. అన్నింటికీ చెక్‌..

Tomato Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వీటిని వండుతుంటారు. ట‌మాటాలు లేనిదే చాలా మంది రోజూ కూర‌ల‌ను చేయ‌రు. అయితే వాస్త‌వానికి ట‌మాటాలు మ‌న‌కు ల‌భించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌ప్ప‌నిస‌రిగా రోజూ తినాలి. రోజూ తిన‌లేమ‌ని భావించేవారు జ్యూస్ తీసి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం తాగాలి. ఒక క‌ప్పు మోతాదులో ఈ జ్యూస్‌ను రోజూ ఉద‌యం తాగ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ట‌మాటా జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

ట‌మాటాల‌లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఇది మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. వీటిలోని ఫైబ‌ర్ శ‌రీరంలోని కొవ్వును క‌రిగించి బ‌రువును త‌గ్గిస్తుంది. క‌నుక ట‌మాటా జ్యూస్‌ను రోజూ తాగితే బ‌రువు ఇట్టే త‌గ్గుతారు. అలాగే ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్‌. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌నల్ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి త‌గ్గుతారు. అలాగే బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

take Tomato Juice daily one cup after breakfast for these benefits
Tomato Juice

ట‌మాటా జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. కామెర్లు వ‌చ్చిన వారికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ ఈ జ్యూస్‌ను తాగితే కామెర్ల వ్యాధిగ్ర‌స్తులు త్వ‌ర‌గా కోలుకుంటారు. అలాగే లివ‌ర్‌లో ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది. ఆక‌లి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ట‌మాటాల్లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారు రోజూ ట‌మాటా జ్యూస్‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది.

ట‌మాటాల్లో ఉండే ఐర‌న్ ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు రోజూ ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్‌ను తాగితే వారం రోజుల్లోనే ర‌క్తం బాగా పెరుగుతుంది. దీంతో అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ట‌మాటా జ్యూస్‌ను తాగితే ర‌క్త నాళాలు శుభ్రంగా మారుతాయి. ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగ‌తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ట‌మాటా జ్యూస్‌ను తాగితే షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి. ఇలా ట‌మాటా జ్యూస్‌తో మ‌నం ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం తాగాలి.

బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం చాలా మంది కాఫీ, టీ ల‌ను తాగుతుంటారు. కానీ అందుకు బ‌దులుగా ట‌మాటా జ్యూస్‌ను తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో పోష‌కాలు, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. అయితే కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు మాత్రం డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఈ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. ఇక ట‌మాటాలు ఆర్గానిక్ విధానంలో పండించిన‌వి అయితే మంచిది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ రావు. ర‌సాయ‌నాలు వేసి పండించిన ట‌మాటాలు అయితే శుభ్రంగా క‌డిగిన త‌రువాతే జ్యూస్ ప‌ట్టాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ట‌మాటా జ్యూస్‌ను తాగే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.

Editor

Recent Posts