Thotakura For Skin Problems : ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే.. ఈ ఆకుకూర‌తో మ‌టుమాయం అవుతాయి..

Thotakura For Skin Problems : మ‌న‌లో చాలా మంది స్కిన్ అల‌ర్జీల‌తో ఎక్కువ‌గా ఇబ్బందిప‌డుతూ ఉంటారు. చ‌ర్మం పై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు, మంట‌లు, చ‌ర్మం పై వాపు రావ‌డం వంటివి ఎక్కువ‌గా జ‌రుగుతూ ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట ప‌డ‌డానికి యాంటీ అల‌ర్జిటిక్ మందుల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. వీటిని వేసుకోగానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే ఈ మందుల ప్ర‌భావం త‌గ్గ‌గానే మ‌ర‌లా దుర‌ద‌లు వ‌స్తూ ఉంటాయి. ఈ మందుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌త్తుగా ఉండ‌డంతో పాటు అనేక ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. మందుల వాడ‌కాన్ని త‌గ్గించి ఇటువంటి అల‌ర్జీ స‌మ‌స్య‌ల నుండి మ‌నం స‌హ‌జ సిద్దంగా కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అల‌ర్జీ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు తోట‌కూర ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శాస్త్రీయంగా నిరూపిత‌మైంది. అల‌ర్జీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి శ‌రీరంలో రక్ష‌ణ క‌ణాల నుండి హిస్ట‌మిన్స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి.

ఇలా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయిన హిస్ట‌మిన్స్ అల‌ర్జీ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. అల‌ర్జీలు రావ‌డానికి కార‌ణ‌మ‌య్యే హిస్ట‌మిన్స్ ను స‌హ‌జ సిద్దంగా తోట‌కూర త‌గ్గిస్తుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా క‌నుగొన్నారు. మ‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే తెల్ల ర‌క్త‌క‌ణాలు అతిగా స్పందించ‌డం వల్ల అల‌ర్జీలు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అల‌ర్జీకి కార‌ణ‌మ‌య్యే ఇమ్యునో గ్లోబిలిన్ ఇ ని ర‌క్ష‌ణ వ్య‌వస్థ క‌ణ‌జాలం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. అల‌ర్జీకి కార‌ణ‌మ‌య్యే ఈ ఇమ్యునో గ్లోబిలిన్ ఇ ని అడ్డుకోవ‌డంలో తోట‌కూర స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంది. తోట‌కూర‌లో గ్యాలిక్ యాసిడ్, వేల‌నిక్ యాసిడ్ అనే రెండు ర‌కాల యాసిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అల‌ర్జీకి కార‌ణ‌మ‌య్యే ఇమ్యునో గ్లోబిలిన్ ఇ అడ్డుకోవ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ అతిగా స్పందించ‌కుండా నియంత్రించి అల‌ర్జీ రాకుండా చేయ‌డంలో కూడా తోట‌కూర ఉప‌యోగ‌ప‌డుతుంది.

 Thotakura For Skin Problems works effectively
Thotakura For Skin Problems

క‌నుక చ‌ర్మానికి సంబంధించిన అల‌ర్జీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌ర‌చూ తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల‌ర్జీ స‌మ‌స్య‌ల నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. తోట‌కూర మ‌నకు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప‌డితే అప్పుడూ దొరుకుతుంది. అలాగే తోట‌కూర దొర‌క‌ని ప్రాంతం అంటూ ఉండ‌దు. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం లోప‌లి నుండి అల‌ర్జీలు త‌గ్గుతాయి. అలాగే బాహ్య చ‌ర్మం పై దుర‌ద‌లు, ద‌ద్దుర్ల‌ను, అల‌ర్జీల‌ను త‌గ్గించ‌డంలో వేప నూనె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. వేప నూనెను స‌మ‌స్య ఉన్న చోట రాసి అర గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ భాగంలో వేడి నీటితో ఆవిరి ప‌ట్టుకోవ‌డం లేదా వేడి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల అల‌ర్జీలు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. అలాగే స్నానం చేసిన త‌రువాత ఆ భాగంలో కొబ్బ‌రి నూనె రాయ‌డం వ‌ల్ల దుర‌ద‌లు త‌గ్గుతాయి. మందుల‌ను వాడ‌డానికి బ‌దులుగా ఈ విధంగా స‌హ‌జ సిద్దంగా కూడా చ‌ర్మ సంబంధిత అల‌ర్జీల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts