Tomato : రోజుకో యాపిల్ లాగా రోజుకో ట‌మాటాను తినాల్సిందే.. ఎందుకంటే..?

Tomato : ట‌మాట‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ ట‌మాట భార‌త‌దేశంలోకి 1850 ల‌లో ప్ర‌వేశించింద‌ని ఒక అంచ‌నా మాత్ర‌మే. మ‌నం ట‌మాటలేని వంట గ‌దిని చూడ‌లేమ‌ని చెప్ప‌వ‌చ్చు. అంత‌గా ట‌మాట మ‌న వంట‌గ‌దిలో స్థానాన్ని సంపాదించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ట‌మాటాల్లో కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంతోపాటు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా ప‌ని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఒక ఆపిల్ ను తింటే డాక్ట‌ర్ తో అవ‌స‌రం ఉండ‌దు అని చెప్తారు. కానీ అన్ని కాలాల్లో అలాగే త‌క్క‌వ ధ‌ర‌లో ల‌భించే ట‌మాట‌ల‌ను కూడా రోజుకు ఒక‌టి చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల డాక్ట‌ర్ తో అవ‌సరం లేద‌ని చెప్ప‌డంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిలో ఉండే లైకోపీన్ అనే ప‌దార్థం శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ గా ప‌ని చేస్తుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ట‌మాటాల్లో అధికంగా ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అన్ని కూర‌గాయ‌ల‌తో చక్క‌గా క‌లిసిపోయే ఈ ట‌మాటాల‌లో ఎన్నో ఆరోగ్య ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి.

we should definitely eat daily one tomato for these benefits
Tomato

ఎర్ర‌గా చూడ ముచ్చ‌ట‌గా ఉన్న ఈ ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రిగి హృద‌య సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిని విరివిరిగా తీసుకోవ‌డం వ‌ల్ల నిత్య య‌వ్వ‌నులుగా ఉంటార‌ట‌. చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించే యాంటీ ఆక్సిడెంట్లు ట‌మాటాల్లో పుష్క‌లంగా ఉంటాయి. చ‌ర్మాన్ని, జుట్టును కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో ట‌మాటాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో కూడా ట‌మాటాలు మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా ట‌మాట యాంటీ క్యాన్స‌ర్ ఏజెంట్ గా కూడా ప‌ని చేస్తుంద‌ని దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని కూడా వారు తెలియ‌జేస్తున్నారు. ఈ విధంగా ట‌మాట మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts