పోష‌కాహారం

ప్ర‌తిరోజు యాపిల్ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

స‌హజంగా ఎక్కువ శాతం మంది యాపిల్ తిన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉండ‌వ‌చ్చు అన్న‌ నానుడి కూడా ఉంది. అది ముమ్మాటికి నిజమే. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం పుష్క‌లంగా ఉంటాయి. ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.

యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు కాల రసాయన పదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయి. రోజుకో యాపిల్ తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అయితే యాపిల్‌ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా నిర్వీర్యమవుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ డైట్‌లో యాపిల్ చేర్చుకుంటే చాలా మంచిది. యాపిల్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

what happens if you eat an apple a day

ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివ‌ర్, జీర్ణక్రియ సమస్యలను నివిరించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. యాపిల్ తిన‌డం వ‌ల్ల గుండెపోటు నుంచి ర‌క్షించుకోవ‌చ్చు. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. తలనొప్పి, ఆస్తమా, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. రోజుకో యాపిల్ తిన‌డం వ‌ల్ల మొద‌డు స‌మ‌స్య‌లు రాకుండా ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. రక్తహీనతతో బాధ‌ప‌డేవారికి యాపిల్‌ను తింటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Admin

Recent Posts