Winter Foods : ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా చలికాలం మొదలైంది. మరికొద్ది రోజులు అయితే చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే స్వెటర్లు, మఫ్లర్లు ధరించడం చేస్తారు. కొందరు మంకీ క్యాప్‌లను కూడా ధరిస్తారు. పాదాలకు రాత్రి పూట సాక్స్‌లు తొడుగుతారు. ఇవన్నీ శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలే. ఇవి శరీరాన్ని బాహ్యంగా వెచ్చగా ఉంచుతాయి. కానీ శరీరాన్ని అంతర్గతంగా వెచ్చగా ఉంచుకోవడం కూడా అవసరమే. అయితే అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు పనిచేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని అన్నీ కలిపి రోజుకు గుప్పెడు మోతాదులో తినాలి. రోజూ సాయంత్రం సమయంలో స్నాక్స్‌కు బదులుగా గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను తినాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోదగినవి వాల్‌నట్స్. ఇవి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అనేక వ్యాధులను నయం చేస్తాయి. క్యాన్సర్, స్థూలకాయం, డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలు తగ్గుతాయి. అలాగే అనేక జీవనశైలి వ్యాధులు రాకుండా చూస్తాయి. పోషకాలను అందిస్తాయి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక రోజూ ఐదారు వాల్‌నట్స్‌ను తినాలి.
ఇక చలికాలంలో సహజంగానే చాలా మందికి చర్మం పొడిగా మారుతుంది. శిరోజాలు, గోర్లు బలహీనంగా మారి విరిగిపోతాయి. అందవిహీనంగా కనిపిస్తాయి. అలాంటి వారు రోజూ గుప్పెడు నల్ల కిస్మిస్‌లను తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి జుట్టును, చర్మాన్ని, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను రాకుండా చూస్తుంది. ఇక చలికాలంలో తినదగిన ఆహారాల్లో జీడిపప్పు కూడా ఒకటి. వీటిల్లో అధిక మోతాదులో పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే జీడిపప్పులో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చలికాలంలో బాదంపప్పును తినడం వల్ల రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. చలికాలంలో మన జీర్ణశక్తి తగ్గి మలబద్దకం వస్తుంది. కనుక బాదంపప్పును తింటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. అలాగే పిస్తా పప్పు కూడా మనకు ఈ సీజన్‌లో అనేక లాభాలను అందిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బరువును తగ్గిస్తాయి. జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తాయి. కనుక ఈ సీజన్‌లో డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను తినడం అలవాటు చేసుకోండి. రోజూ గుప్పెడు తిన్నా చాలు.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.