Off Beat

కొత్త సంవత్సరంలో చాలా మంది తీసుకునే అతి ముఖ్యమైన 5 నిర్ణయాలు ఇవే..!

కొత్త సంవత్సరంలో మనం ఏవేవో చెయ్యాలని అనుకుంటాం. కొత్త సంవత్సరం లో చెడు అలవాట్లు మానుకోవాలి, డబ్బు ఆదా చేసుకోవాలి, ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటారు మనోళ్లు. ఇలా అందరూ అనుకొనే ఒక 5 నిర్ణయాలు.. చాలా మంది కొత్త సంవత్సరం రాగానే, మద్యపానం ధూమపానంని వదిలెయ్యాలి అని అనుకుంటారు. అందుకే డిసెంబర్ 31 వ తారీఖున ఎగబడి తాగి, మరుసటి రోజు అనగా జనవరి 1st నుండి మానెయ్యాలి అనుకుంటారు. కా ఆ తరువాత జరిగేది మీ అందరికి తెలుసు.

డబ్బు డబ్బు డబ్బు. డబ్బులు బాగా ఖర్చు పెట్టే వారు అనుకొనేది, కొత్త సంవత్సరం నుండి డబ్బు బాగా ఆదా చేసుకోవాలి అని అనుకుంటారు. అబ్బాయిలు అయితే ఎక్కువ శాతం కొత్త సంవత్సరంలో వారు ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రొపోజ్ చెయ్యాలి అనుకుంటారు, కొంత మంది ధైర్యం చేసి ఫిబ్రవరి 14 వ తారీఖున ప్రొపోజ్ చేస్తారు అనుకోండి. మరి కొంత మంది ప్రొపోజ్ చెయ్యకుండా మళ్ళీ చేద్దాంలే అని వదిలేస్తారు.

5 most common new year resolutions people take

చాలా మంది తమ కుటుంబం కోసం సరైన సమయాన్ని కేటాయించలేకపోతారు, అందుకే కొత్త సంవత్సరంలో అమ్మా నాన్న బంధువులతో కలిసి ప్రదేశాలు తిరగాలి అని అనుకుంటారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగం లేని వాళ్ళు ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇంకా మంచి పోసిషన్ కి వెళ్లాలనుకుంటారు. డబ్బులు బాగా సంపాదించి నలుగురిలో బాగా బ్రతకాలని కోరుకుంటారు. అది వ్యాపారం చేసే వాళ్ళు అయినా, ఉద్యోగం చేసే వాళ్ళు అయినా. అత్యధిక శాతం మంది అనుకొనేవి మాత్రమే ఇందులో ప్రస్తావించడం జరిగింది. చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు, కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో కామెంట్స్ లో తెల‌పండి.

Admin

Recent Posts