Off Beat

జీన్స్‌ ప్యాంట్లపై చిన్న చిన్న పాకెట్లను చూశారా ? వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే..?

మనం ధరించేందుకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో జీన్స్‌ ప్యాంట్లు ఒకటి. అనేక డిజైన్లు, మోడల్స్‌లలో రక రకాల జీన్స్‌ ప్యాంట్లు మనకు లభిస్తున్నాయి. అయితే చాలా వరకు జీన్స్‌ ప్యాంట్లను మీరు గమనించారా ? వాటికి ఉండే జేబుల మీద చిన్న చిన్న పాకెట్లు ఉంటాయి. అవును. అవే కదా..? అయితే ఆ పాకెట్లను ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?

జీన్స్‌ ప్యాంట్లకు ఉండే చిన్న చిన్న పాకెట్లలో సహజంగానే మనం కాయిన్లను వేసుకుంటాం. లేదా తాళం చెవులు, టిక్కెట్లు వంటి వస్తువులను ఉంచుకుంటాం. అయితే నిజానికి ఆ పాకెట్లను ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరే.

have you seen these small pockets on jeans

అప్పట్లో.. అంటే.. 1800వ సంవత్సరాల్లో జీన్స్‌ మార్కెట్లలోకి వచ్చాయి. అప్పట్లో మనకు ఉన్నట్లు చేతికి పెట్టుకునే వాచ్‌లు ఉండేవి కావు. పాకెట్‌ వాచ్‌లు ఉండేవి. వాటిని పాకెట్లలో పెట్టుకునేందుకు వీలుగా ఉండేందుకుగాను జీన్స్‌ ప్యాంట్లకు అలా పాకెట్లను కుట్టేవారు. తరువాత అదే ట్రెండ్‌ కొనసాగింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పాకెట్‌ వాచ్‌లు లేవు. కనుక వాటికి బదులుగా మనం పాకెట్లలో పైన తెలిపినట్లుగా భిన్న రకాల వస్తువులను పెట్టుకుంటున్నాం. ఇదీ.. జీన్స్‌ ప్యాంట్లకు చిన్న చిన్న పాకెట్లను ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న అసలు కారణం. అందుకనే ఆ పాకెట్లను వాచ్‌ పాకెట్లు అని కూడా పిలుస్తారు. ఆ పేరు అందుకనే వచ్చింది.

Admin

Recent Posts