Sesame Seeds And Honey : నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వులు, తేనె రెండిట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది,రెగ్యులర్ గా తేనెను కూడా వాడుతూ ఉంటారు. నువ్వులతో మనం రకరకాల వంటకాలని తయారు చేసుకోవచ్చు. అలానే, తేనె ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన అనేక లాభాలని పొందడానికి అవుతుంది. తేనే, నువ్వుల వలన ఎటువంటి లాభాన్ని పొందొచ్చు..? ఏఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, క్యాల్షియం ఉంటాయి. అలానే విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటాయి. నువ్వుల లో తేనెను కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని, ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్లు నువ్వులని కలిపి, ఉదయం పూట తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకున్నట్లయితే, శరీరానికి తక్షణ శక్తి ఉంటుంది. నీరసం, అలసట కూడా తగ్గుతాయి.
రోజంతా కూడా చురుకుగా, ఉత్సాహంగా ఉండడానికి అవుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. నువ్వులను, తేనే ని కలిపి తీసుకోవడం వలన ఆకలి బాగా తగ్గుతుంది. తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. రక్తహీనత సమస్య కూడా ఉండదు. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ తీసుకుంటే, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. తేనె, నువ్వులు కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఉండవు.
ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే ఇందులో కొంచెం శొంఠి పొడి కలుపుకుని తీసుకోండి. అప్పుడు నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందడానికి అవుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చూశారు కదా ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో. మరి ఈ సమస్యల నుండి దూరంగా ఉండాలంటే, దీనిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు.