Off Beat

మీలో ఎంత మంది ఓయో కి వెళ్ళారు, మొదటిసారి అనుభవం ఎలా ఉంది ?

ఓయో రూమ్స్ అంటే అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీరి వ‌ల్ల నిజంగా రూమ్స్ అవ‌స‌రం ఉన్న‌వారికి చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఓయో రూమ్స్ ఎవ‌రికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయో తెలియ‌దు కానీ మాకు మాత్రం బాగానే యూజ్ అయింది. మేము మాత్రం ఐదుగురం వెళ్ళాము..అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు ఇంకా నేను. విజయవాడలో ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు.

ఓయో తో మొదటిసారి అనుభవం అదే. ఫ‌ర్వాలేదు బాగానే ఉంది.పెద్ద మంచం మీద తెల్లటి కంఫర్టర్స్ తో గది మధ్యస్తంగా ఉంది. రూంలో ఓ బీరువా, టీవీ, ఏసీ.. బాత్రూంలో గీజర్ అన్నీ ఉన్నాయి పైగా చక్కగా పని చేస్తున్నాయి కూడా!!.బాత్రూం కూడా విశాలంగా,శుభ్రంగా ఉంది.సోప్,హాండ్ వాష్ కూడా పెట్టారు!!.ఆ రాత్రి పెళ్లి చూసుకుని ట్రైన్ టైం వరకూ రూంలో హాయిగా నిద్రపోయి తిరిగి వైజాగ్ వచ్చాము.ఓయో తో నా మొదటి ఆఖరి అనుభవం అదే!!.

how are oyo rooms

ప్ర‌స్తుతం చాలా మంది ఓయో రూమ్స్ అంటే త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అలాంటి వారు త‌మ ప‌ద్ధ‌తిని ఇక‌నైనా మార్చుకుంటే మంచిది. నిజంగా రూమ్స్ కావాల‌నుకునే వారికి చీప్ అండ్ బెస్ట్‌లో ఓయో రూమ్స్ చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

Admin

Recent Posts