Off Beat

ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

ఏడాదిలో మనకు 12 నెలలు ఉంటాయి. అలాగే 12 రాశి చక్రాలు ఉంటాయి. వీటి ప్రకారం ఎవరి భవిష్యత్తు అయినా ఆధార పడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, వారి స్వభావం ఎలా ఉంటుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు నెలలో పుట్టిన వారికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వారు ఇతరులను అడగకుండానే స్వతహాగా నిర్ణయాలను తీసుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు.

ఈ నెలలో పుట్టిన వారు ఇతరుల మనస్సును గెలుస్తారు. అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఏదైనా పని అనుకుంటే వెంటనే ప్రారంభిస్తారు. అయితే వీరు తలపెట్టిన పనులను మధ్యలో ఆపరాదు. ఆపితే ఇక అవి జరగవు. ఆగస్టు నెలలో పుట్టిన వారికి డబ్బు విషయంలో సమస్యలు వస్తాయి. అన్ని విధాలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కలలు కనే స్వభావం ఉంటుంది. కొందరు సోమరిపోతులుగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతరులను ఎదిరించే శక్తి ఉంటుంది. దాంతో ఎవర్నయినా తిప్పి కొడతారు. శత్రువులను సైతం జయిస్తారు.

if you born in august month then know about your qualities

వీరు మంచి వాతావరణంలో ఉండాలని, మంచి జీవితం గడపాలని కోరుకుంటారు. దైవాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. సంప్రదాయాలపై గౌరవం ఉంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువే. లోక జ్ఞానం మెండు. జ్యోతిషులు అయితే రాణిస్తారు. మతం, పురాణాలపై నమ్మకం, అవగాహన ఉంటాయి. దైవ భక్తి ఎక్కువ. వీరు ప్రేమను ఎక్కువగా నమ్ముతారు. ఇష్టపడే వారిని ప్రేమిస్తారు.

వీరికి కంటి జబ్బులు లేదా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సోమ, బుధ, ఆది వారాల్లో పనులు చేస్తే కలసి వస్తుంది. ఆకుపచ్చ, గోల్డ్‌ కలర్‌, ఆరెంజ్‌ కలర్‌ దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది. ఆ రంగులు కలసి వస్తాయి. పగడం, పసుపు రంగు రాయిలను ధరిస్తే మంచి జరుగుతుంది.

Admin

Recent Posts