Off Beat

ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.! కనురెప్పలు సైతం గడ్డకట్టేంత చలి.!! ఆ విశేషాలేంటో తెల‌సుకుందాం.

మన దగ్గర కాస్త చలికే మనం వణికిపోతుంటే…ఈ మధ్య మరో దేశంలో ఉండే నా ఫ్రెండ్ ఇక్కడ మైనస్ పదమూడు డిగ్రీలు అంటూ ఇంటిమందున్న వెహికిల్స్ పైన,ఇళ్లపైన పొరలా కప్పబడిన మంచు ఫోటోలను పంపింది..అమ్మో అనిపించింది..మైనస్ పదమూడు అంటే లెక్కలేస్తున్నా ఈ లెక్కన మన చలి బెటర్ అనిపించింది..అంతేకాదు చలి,ఎండ ,వాన ప్రకృతికే కానీ మనిషికేంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి…కానీ కనురెప్పలు సైతం గడ్డకట్టే చలి గురించి ఎప్పుడైనా విన్నారా..వినడమేంటి..డైరెక్ట్ చూడండి..

ఒయ్ మ్యాకన్ ప్రపంచంలోనే అతి చల్లనైన గ్రామం.. ఇక్కడ దాదాపు రోజులో 21గంటల పాటూ మబ్బులే ఉంటాయి.మిగతా మూడు గంటల పాటు సూర్యుడు కనిపిస్తే కనిపిస్తాడు.. లేదంటే అదీ లేదు. ఒయ్ మ్యాకన్ లో కేవలం 500 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు.ఇక్కడ ఉష్ణోగ్రతలు కనివిని ఎరుగని స్థాయికి పడిపోయాయి. రికార్డు స్థాయిలో మైనస్‌ 67 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయే ఉష్ణోగ్రతలకు కళ్లలోని తేమ, కను రెప్పలు సైతం గడ్డ కట్టేస్తుంటాయి. ఇక్కడ నిత్యం దాదాపు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా అక్కడ చిన్నారులు స్కూళ్లకు వెళ్తుంటారు. అయితే, ఉష్ణోగ్రత మరింత తగ్గితే ఇక్కడ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారు. 2013లో ఇక్కడ మైనస్ 71 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

oymyakon village worlds coldest place

ఇక మనం ఎవరమైనా ఇక్కడకు చేరుకోవాలంటే చాలా కష్టం.. విమానాలు చలికాలంలో ఇక్కడకు రాలేవు. అలాగే దీనికి దగ్గరగా ఉన్న పెద్ద నగరం యాకుత్స్క్ నుండి ఇక్కడకు కారులో చేరుకోవాలంటే దాదాపు రెండు రోజులు పడుతుంది. నిత్యం వర్షం,రోడ్డంతా మంచు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడూ వారి కార్ల ఇంజన్లు రన్నింగ్ లోనే ఉంటాయట. అలాగే ఈ వాతావరణానికి పంటలు అసలు పండవు. చాలా భాగం వరకూ వారు గడ్డకట్టిన మాంసాన్ని తినే బ్రతుకుతారు. చేపలు, మకరోనీ, గుర్రం రక్తంతో చేసిన ఐస్ క్యూబ్స్ ను వంటల్లో వాడుతూ ఉంటారు. ఎంత చలిగా ఉంటుందంటే అక్కడ చేపలు అమ్మే వాళ్ళు.. వాటిని ప్రత్యేకంగా ఫ్రిడ్జ్ లలో దాచాల్సిన అవసరం ఉండదు.ఇక్కడ సాధారణ జీవితం గురించి ఊహించుకోవడానికి ప్రయత్నించకండి..ఇక్కడ నమోదవుతున్న చల్లని ఉష్నోగ్రతలకు థర్మోమీటరే పగిలిపోయింది అంటే అక్కడ బతికే వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో కదా..

Admin

Recent Posts