Off Beat

క్రెమ్లిన్ అంటే ఏమిటి?

క్రెమ్లిన్ అనేది మాస్కో నగరపు కోట . మాస్కోవా నది పక్కన పదిహేను భవంతులు , ఇరవయి బురుజులు , మైలున్నర పొడవు కోట గోడలు(అది కూడా 21 అడుగుల మందం) ఉన్న ఒక పెద్ద భవన సముదాయం. చర్చిలు , భవంతులు కలగలుపుగా ఉన్న ఈ కోట ప్రాసాదం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. చరిత్రలో, క్రెమ్లిన్ అధికార పీఠం హోదా, చాలా ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉంది. ప్రధాన మైన నిర్మాణాలన్నీ, పదిహేనవ శతాబ్ది లో మూడవ ఇవాన్ ఇటలీ భవన నిర్మాణ నిపుణులతో(Rodolfo Fioravanti) నిర్మింప చేసాడు.

క్రీ.శ 1156 లో యురీ దోల్గురుకీయువరాజు ఈ ప్రదేశం లో చెక్కతో భవన నిర్మాణం చేసాడు. అప్పటికిది క్రెమ్లిన్ కాదు. పదునాలుగవ శతాబ్దిలో కానీ, ఆపేరు ప్రాముఖ్యత లోకి రాలేదు. పద్ధెనిమిదో శతాబ్దిలో రాజధాని సెయింట్ పీటర్స్ బర్గ్ కి మారడంతో క్రెమ్లిన్ కీర్తి కొంచెం సన్నగిల్లింది. ఎందుకంటే అప్పటిదాకా జార్ (TSAR) చక్రవర్తుల నివాసం ఇదే మరి. ఆతర్వాత రష్యన్ విప్లవం అనంతరం, మళ్ళీ, మాస్కో రాజధాని అయి, విప్లవ నాయకులు లెనిన్ ,స్టాలిన్ వంటి వారు, ఇందులో నివసించడంతో మళ్ళీ ఒక వెలుగు వెలిగింది. సోవియట్ రష్యా ఉన్నంతవరకు అధికారం అంటే క్రెమ్లినే అనేంత పేరు తెచ్చుకుంది.

what is cremlin and why it is famous

అసలు క్రెమ్లిన్ (క్రేమెలిన) అంటే, రష్యన్ భాషలో, కోట లేదా దుర్గం అనే అర్ధం . అందుకే రష్యా అంతటా క్రెమ్లిన్లు చాలానే ఉన్నాయి, కానీ మాస్కో లో ఉన్న దాని ముందు అవి వెలవెల బోతాయి. మొదట్లో నగరం మధ్య భాగంలో కోట ఉండేది. తర్వాత ఊరు పెరిగి, నగర కేంద్రమే మారి పోయింది. మొత్తం ఎనిమిది వందల ఏళ్లలో, ఈ క్రెమ్లిన్ ఎన్నో సార్లు విస్తరించ బడింది. 1991 నుండి ఈ మధ్య దాకా రష్యన్ అధ్యక్షుడు ఇక్కడ నివసించేవాడు.అయితే పుతిన్, దగ్గర లో ఉన్న నోవో ఒగోర్యేవో భవంతిలో, ఉంటున్నాడట. అధ్యక్ష కార్యాలయం మాత్రం దీనిలోనే ఉంది. ప్రతిరోజూ అయన ఈ భవంతిలో, ఎర్రని తివాచీ మీద, నడిచి వచ్చే వీడియో, బాగా ఎక్కువ ప్రాచుర్యం ఉన్నవాటిలో ఒకటి. ఇందులో ఉన్న భవంతుల్లో ఆర్మరీ చేంబర్, క్రెమ్లిన్ పాలెస్ ,సెనేట్ భవంతి, సుప్రీం సోవియట్ భవంతి, కేధడ్రల్ స్క్వేర్ వంటివి ఎన్నో ఉన్నాయి.

Admin

Recent Posts