Off Beat

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు…. నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు. internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?. ఆవును అవును, అని కొడుకు జవాబిచ్చాడు. ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు… ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

a fathers answer to his son about human relationships

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!! నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను. నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను. రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు. నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం… అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు. నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా?? కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా??? ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే… నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!! నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం. నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి తెలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి. టెక్నాలజీ ఉండాలి కానీ… అది మాత్రమే జీవితం కాకూడదు ! దానికి మనం బానిసలం కాకూడదు! మనుషులతో జీవించండి….. పరికరాలను వాడుకోండి….. ప్రేమించవలసిన మనుషులను వాడుకొని, వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి…. దీంతో కొడుకుకి మాటలు లేవు..

Admin

Recent Posts