Off Beat

పోలీస్‌ లేదా ఆర్మీ ట్రైనింగ్ లో జుట్టును చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా..?

పోలీస్‌ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత వారికి కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాతే వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ట్రైనింగ్ లో భాగంగా జాయిన్ అవ్వగానే జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు.. మరి ఇలా ఎందుకు కత్తిరిస్తారు? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అయితే ట్రైనింగ్ సమయంలో అనేక కఠిన టాస్కులు ఇస్తారు. నేలపై పాకడం, తాళ్లు పట్టుకొని ఎక్కడం, జంపు చేయడం, దొర్లడం అనేవి ఉంటాయి. ఈ టాస్కులు చేసే సమయంలో జుట్టు పొడవుగా ఉండటం వల్ల గాయాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని జుట్టు చిన్నగా కత్తిరిస్తారు. అలాగే వారు వేసుకునే యూనిఫాం వల్ల అందరిలో ఒకే రకమైన భావన కలిగి కుల, మత వర్గ భేదాలు ఉండవని, హెయిర్ కట్ వల్ల కూడా అందరూ ఒకటేనన్న భావం ఏర్పడుతుందని, దీనివల్ల అందరూ ఐక్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని అంటారు.

why hair is cut so small in police or army training

సాధారణంగా జుట్టును ఫ్యాషన్ లాగా కనిపించేలా కట్ చేస్తే మాత్రం అది ఎక్కువ సమయం తీసుకుంటుందని, చిన్న హెయిర్ ఉండటం వల్ల దానికి పెద్దగా సమయం పట్టదు కనుక సమయాన్ని ఆదా చేయడం కోసం కూడా హెయిర్ కట్ చేస్తారు. ట్రైనింగ్ అంటేనే నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇందులోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాల్సిందే.

Admin

Recent Posts