Aloe Vera Side Effects : ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో కలబంద ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. కలబందలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపుగా మనకు వచ్చే అన్నీ రకాల వ్యాధులను నయం చేయడంలో కలబంద మనకు ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలను, జుట్టు సమస్యలను తగ్గించడంలో మధుమేహాన్ని నివారించడంలో కలబంద మనకు దోహదపడుతుంది. సౌందర్య ఉత్పత్తుల్లోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ కలబందను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కలబంద ఉత్పత్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. కలబందను వాడడం వల్ల మన చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని మనందరికి తెలుసు.
కానీ కలబందను అతిగా వాడడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. వాస్తవానికి కలబంద మనకు ఎంతో దోహదపడుతుంది. కానీ కలబంద చెట్టు నుండి తీసిన గుజ్జును సరైన నియమాలు పాటించకుండా తాగడం వల్ల మనం దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ దుష్ప్రభావాలు శరీరానికి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మనలో కొంతమంది ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి, పోషకాలు ఎక్కువగా గ్రహించబడడానికి భోజనానికి ముందు కలబంద రసాన్ని తీసుకుంటూ ఉంటారు.
ఈ కలబంద రసాన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల దీనిలో లాక్సైటివ్ గుణాలు విరోచనాలను కలిగిస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు అధికమవుతాయి. అంతేకాకుండా కలబందలో ఉండే లాక్సైటివ్ గుణాలు మనం తీసుకున్న మందులను శరీరం గ్రహించకుండా చేస్తుంది. కొందరిలో కలబంద రసం అలర్జీకి కూడా కారణమవుతుంది. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల కొందరిలో చర్మం పై చదద్దుర్లు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కలబంద వల్ల అలర్జీకి గురి అవుతామో లేదో తెలుసుకోవడానికి రెండు లేదా మూడు చుక్కల కలబంద రసాన్ని చర్మానికి రాయాలి. చర్మం పై సమస్యలు తలెత్తితే కలబంద వల్ల మనం అలర్జీ బారిన పడే అవకాశం ఉందని భావించాలి.
గర్భిణీ స్త్రీలు కలబంద రసానికి వీలైనంత దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కలబంద రసాన్ని వాడడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా పాలిచ్చే తల్లులు కూడా దీనిని తీసుకోకూడదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా ఈ కలబంద రసాన్ని ఇవ్వకూడదు. కలబంద రసాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. కలబంద రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలను అధికం చేసే ఎడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను తగ్గించి క్రమరహిత హృదయ స్పందనలను కలిగిస్తుంది. కలబందను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
కనుక మధుమేహానికి మందులు వాడే వారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ లు తీసుకునే వారు ఈ కలబంద రసానికి దూరంగా ఉండడం చాలా అవసరం. దీర్ఘకాలం పాటు కలబందను ఉపయోగించడం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల పెల్విస్ మరియు మూత్రపిండ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఈ కలబంద రసాన్ని తగిన మోతాదులో వైద్యులు సూచించిన ప్రకారం తీసుకోవడంచాలా అవసరం.