Guava Leaves Benefits : మనకు ఈ సీజన్‌లో జామకాయలు ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయి. జామకాయలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. జామ పండ్ల కన్నా జామకాయలు అంటేనే ఎంతో ఇష్టపడతారు. జామకాయలు దోరగా ఉంటేనే చాలా మందికి నచ్చుతాయి. జామకాయలను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. జామకాయల్లో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక జామకాయలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే జామకాయలు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
జామకాయలు మనకు సీజన్‌లలో మాత్రమే లభిస్తాయి. కానీ జామ ఆకులు మాత్రం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కనుక వీటిని ఉపయోగించి మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జామ ఆకులతో తయారు చేసే టీ ని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో అనేక లాభాలు ఉంటాయి. ఐదారు జామ ఆకులను తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో వేసి మరిగించాలి. నీళ్లను మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు మరిగించాక స్టవ్ ఆఫ్ చేయాలి. అనంతరం ఈ నీళ్లను ఒక కప్పులోకి తీసుకుని వాటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అవసరం అయితే అందులో రుచి కోసం నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. ఇలా రోజుకు రెండు కప్పులు.. అంటే.. ఉదయం, సాయంత్రం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
పైన తెలిపిన విధంగా జామ ఆకులతో టీని తయారు చేసి రోజుకు రెండు సార్లు తాగితే శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. వరుసగా 15 రోజుల పాటు ఇలా తాగితే శరీరంలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గుతారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే ఎంతో లాభం పొందవచ్చు. జామ ఆకుల టీ కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కూడా మొత్తం పోతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి.
జామ ఆకుల టీని రోజుకు రెండు పూటలా తాగితే షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. జామ ఆకుల టీని తాగితే ముక్కు రంధ్రాలు కూడా క్లియర్‌గా మారుతాయి. దీంతో ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా జామ ఆకులతో మనం అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ ఆకులతో టీని తయారు చేసి తాగడం మరిచిపోకండి.