Athibala : పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే అతిబ‌ల‌.. అనేక నొప్పుల‌కూ ప‌నిచేస్తుంది..!

Athibala : అతిబల అన్ని రుతువులలోనూ సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క. ఇది మాల్వేసి (Malvaceae) కుటుంబానికి చెందినది. ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి కొమ్మలు చాపినట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో వజ్రం ఆకారాన్ని కలిగి కాడపై ఒకటి మార్చి ఒకటిగా అమరి ఉంటాయి.

health benefits of Athibala plant

ఈ మొక్క ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అతిబల ఆకుతొడిమ ఆకు పొడవు కంటే తక్కువ పొడవుతో ఆకు యొక్క మూడో భాగంలో ఉంటుంది. వీటి చివరల కింద పొట్టిగా కొంచెం నెరిసిన రోమాల వలె ఉంటుంది. ఆకు యొక్క అర్ధ శిఖరభాగం పళ్ల వలె లేక రంపపు పళ్ల వలె ఉండి మిగతా ఆకు భాగం మామూలుగా ఉంటుంది. ఆకు తొడిమలు వాటి ఆధార భాగం వద్ద చిన్న చిన్న సన్న ముళ్లు కలిగి ఉంటాయి.

అతిబ‌ల మొక్క‌కు చెందిన పొడిని అనేక విధాలుగా ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ పొడిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను తొల‌గించేందుకు అతిబ‌ల ఎంత‌గానో ప‌నిచేస్తుంది. దీని పొడిని వాడ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శీఘ్ర స్క‌ల‌న స‌మ‌స్య త‌గ్గుతుంది. వీర్యం ఎక్కువ‌గా త‌యార‌వ‌డ‌మే కాక నాణ్యంగా కూడా ఉంటుంది. అర టీస్పూన్ అతిబ‌ల పొడిని ఒక టీస్పూన్ తేనెతో క‌లిపి గోరు వెచ్చ‌ని నీటితో రోజుకు రెండు పూట‌లా తీసుకోవాలి. దీంతో పురుషుల్లో ఉండే శృంగార సమ‌స్య‌లు పోతాయి.

2. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి కూడా ఈ పొడి ఎంత‌గానో ప‌నిచేస్తుంది. అందుకు గాను అర టీస్పూన్ అతిబ‌ల పొడిని తీసుకుని తేనె లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి సేవించాలి. ఇలా రోజుకు రెండు సార్లు తీసుకుంటుండాలి. దీంతో ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. పోష‌కాహార లోపం వ‌ల్ల వచ్చే వ్యాధుల‌ను త‌గ్గించేందుకు అతిబ‌ల పొడి ప‌నిచేస్తుంది. దీంతో శ‌రీరం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు త‌గ్గుతాయి.

4. మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించేందుకు కూడా అతిబ‌ల ప‌నిచేస్తుంది. మూత్రంలో మంట‌గా అనిపించ‌డం, నొప్పిగా ఉండ‌డం, మూత్రం స‌రిగ్గా రాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

5. గాయాలు, పుండ్ల‌ను మాన్చ‌డంలోనూ అతిబ‌ల పొడి ప‌నిచేస్తుంది. నీటితో కొద్దిగా పొడిని క‌లిపి పేస్ట్‌లా చేసి రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి.

6. కొబ్బ‌రినూనెలో కొద్దిగా అతిబ‌ల పొడి క‌లిపి ముఖానికి రాయాలి. కొంత సేపు అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి.

7. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అతిబ‌ల పొడి వేసి మ‌రిగించాలి. 5 నిమిషాల పాటు మ‌రిగించాక ఆ మిశ్ర‌మాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి త‌గ్గుతుంది. నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది.

అతిబ‌ల పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీన్ని కొని తెచ్చి వాడుకోవ‌చ్చు. గ‌ర్భిణీలు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు దీన్ని వాడుకోవాలి.

Admin

Recent Posts