Naga Chaitanya : స‌మంతతో విడాకుల అనంత‌రం.. ఇంకో అమ్మాయితో ల‌వ్‌లో నాగ‌చైత‌న్య‌..?

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నాగ‌చైత‌న్య‌, స‌మంత పేరు తెచ్చుకున్నారు. కానీ వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్లు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాక‌.. ఆ పేరు వారికి పోయింది. తాము ఇక‌పై భార్యాభ‌ర్త‌లుగా ఉండలేమ‌ని, కేవ‌లం స్నేహితులుగానే కొన‌సాగుతామ‌ని చెప్పారు. అయితే వీరు విడిపోయాక క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం లేదు.

Naga Chaitanya  reportedly is in love with tollywood actress

గతంలో ల‌వ్ స్టోరీ సినిమా స‌క్సెస్ అయిన‌ప్పుడు.. త‌రువాత చైతూ బ‌ర్త్ డే స‌మ‌యంలో స‌మంత అత‌నికి విషెస్ చెప్ప‌లేదు. కానీ తాను పెంచుకునే కుక్క‌ల‌కు మాత్రం బ‌ర్త్ డే చేసి ఏకంగా ఆ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే న‌టుడు రానాకు, ఆయ‌న భార్య‌కు కూడా బ‌ర్త్ డే విషెస్ చెప్పింది. కానీ త‌న మాజీ భ‌ర్త‌కు, అక్కినేని ఫ్యామిలీకి స‌మంత సోష‌ల్ మీడియాలోనూ విషెస్ చెప్ప‌డం లేదు.

అయితే తాజాగా ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రో అమ్మాయితో ల‌వ్‌లో ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చైతూ.. న‌టి కృతి శెట్టితో ల‌వ్‌లో ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. ప్ర‌స్తుతం కృతి శెట్టి చైతూ స‌ర‌స‌న బంగార్రాజు అనే మూవీలో న‌టిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌నే వార్త వైర‌ల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ఇక నాగ‌చైత‌న్య త్వ‌ర‌లో బంగార్రాజు మూవీతోపాటు అమీర్‌ఖాన్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డాలోనూ క‌నిపించ‌నున్నాడు. స‌మంత విష‌యానికి వ‌స్తే.. త్వ‌ర‌లో శాకుంత‌లం, కాతువాకుల రెండు కాద‌ల్ అనే మూవీల్లో క‌నిపించ‌నుంది. ఓ బాలీవుడ్‌, ఓ హాలీవుడ్ మూవీలో న‌టించ‌నుంది. ఇటీవ‌లే ఈమె న‌టించిన పుష్ప మూవీలోని ఐట‌మ్ సాంగ్‌కు మంచి పేరు వ‌చ్చింది.

Editor

Recent Posts