మొక్క‌లు

నేల ఉసిరి మొక్క‌.. ప్ర‌యోజ‌నాలు అద్భుతం..!

మన చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక చిన్న చిన్న మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. ఆయుర్వేద ప‌రంగా అవి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. కానీ ఆ మొక్క‌ల గురించి చాలా మందికి స‌రిగ్గా తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇది కేవ‌లం 60 సెంటీమీట‌ర్ల ఎత్తు మాత్ర‌మే పెరుగుతుంది. దీనికి కొమ్మ‌ల‌కు చిన్న చిన్న కాయ‌లు కాస్తాయి. అయితే దీనికి, సాధార‌ణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరి లాగే నేల ఉసిరి మొక్క కూడా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

health benefits of nela usiri

1. నేల ఉసిరి ఆకుల‌ను బాగా దంచి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని గాయాలు, వాపుల‌పై రాసి క‌ట్టు క‌డుతుండాలి. దీంతో గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. వాపులు త‌గ్గుతాయి.

2. విరిగిన ఎముక‌లు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకుల‌ను ఉప్పుతో క‌లిపి దంచి ఆ మిశ్ర‌మంతో క‌ట్టు క‌డ‌తారు.

3. నేల ఉసిరి ఆకుల‌ను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనము చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు త‌గ్గుతాయి.

4. నేల ఉసిరి ఆకుల‌ను దంచి నీళ్ల‌లో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే నీటిని వ‌డ‌క‌ట్టి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో నాలుక‌, నోరు, పెద‌వులు ప‌గ‌ల‌డం త‌గ్గుతుంది. ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. నేల ఉసిరి ఆకుల ర‌సం లేదా ఆకుల చూర్ణంకు చెందిన క‌షాయాన్ని సేవిస్తుంటే ద‌గ్గు, ద‌మ్ము త‌గ్గుతాయి.

6. నేల ఉసిరి ఆకుల ర‌సం ఒక టీస్పూన్ లేదా చూర్ణం ఒక టీస్పూన్‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. కామెర్లు త‌గ్గుతాయి.

7. నేల ఉసిరి ఆకుల‌ను అలాగే న‌మిలి తింటుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది. అరుచి స‌మ‌స్య త‌గ్గుతుంది.

8. ఈ మొక్క‌ల ఆకుల నుంచి ర‌సం తీసి దాన్ని చ‌క్కెర‌తో క‌లిపి సేవించాలి. దీంతో వెక్కిళ్లు త‌గ్గుతాయి.

9. మూత్రవ్యాధులలో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు, వేర్ల‌ను దంచి తినిపించాలి.

10. స్త్రీలలో రుతుస్రావమెక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల‌ చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి.

11. ఈ మొక్క‌ల ఆకుల కషాయం తాగితే లివర్‌ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts