ఆయుర్వేద ఔష‌ధాలు

ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తుందంటే..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాల్లో ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి ఒక‌టి. ఆరోగ్య వ‌ర్ధ‌ని అంటే ఆరోగ్యాన్ని మెరుగు పరిచేది అని అర్థం. ఈ ఔష‌ధంలో త్రిఫ‌ల‌, శిలాజిత్తు, గుగ్గుళ్లు, చిత్ర‌మూలం, వేప వంటి ఎన్నో మూలిక‌లు ఉంటాయి. అందువ‌ల్ల ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది.

health benefits of arogyavardhani vati

1. ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి జీర్ణ‌వ్య‌వస్థ ప‌నితీరుకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో యాంటీ ఫ్లాట్యులెంట్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఆక‌లి పెరుగుతుంది. అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం పోష‌కాల‌ను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. ఆరోగ్య‌వ‌ర్ధ‌నివటిలో ఉండే త్రిఫ‌ల శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల మొటిమ‌లు, ఎగ్జిమా త‌గ్గుతాయి. శరీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. సోరియాసిస్‌, ఎగ్జిమా, మొటిమ‌లు, ఎండ వ‌ల్ల చ‌ర్మం కందిపోవ‌డం స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టిని తీసుకోవాలి. దీని వల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. స్థూల‌కాయం త‌గ్గుతుంది.

4. ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల అనేక లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముఖ్యంగా హెప‌టైటిస్‌, జాండిస్‌, ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలో ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి బాగా ప‌నిచేస్తుంది. గుండె కండ‌రాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ బ్లాక్స్, బ్ల‌డ్ క్లాట్స్ ఏర్ప‌డ‌వు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

6. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టిని రోజూ తీసుకోవాలి. ఇందులో ఉండే శిలాజిత్తు చిన్న‌పేగుల కండ‌రాల‌ను దృఢంగా చేస్తుంది. లివ‌ర్ నుంచి బైల్ విడుద‌ల స‌క్ర‌మంగా అయ్యేలా చూస్తుంది. దీంతో పేగుల్లో ఆహారం క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉంటాయి. సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

7. శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న‌వారు ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టిని తీసుకోవాలి. దీంతో ట్రై గ్లిజ‌రైడ్స్ స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్త‌నాళాల్లో ప్లేక్ చేర‌కుండా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టి మంచిదే అయిన‌ప్ప‌టికీ దీన్ని డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు వాడుకోవాలి. దీన్ని రోజూ 120 నుంచి 500 ఎంజీ మోతాదులో రోజుకు 1, 2 లేదా 3 సార్లు తీసుకోవ‌చ్చు. గోరు వెచ్చ‌ని నీరు లేదా తేనె లేదా వేపాకుల ర‌సం లేదా అల్లం ర‌సంతో దీన్ని తీసుకోవాలి. డాక్ట‌ర్ సూచ‌న‌తో ఈ ఔష‌ధాన్ని 4 నుంచి 6 నెల‌ల వ‌ర‌కు నిరంత‌రాయంగా వాడుకోవ‌చ్చు.

ఆరోగ్య‌వ‌ర్ధ‌ని వ‌టిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. క‌డుపు నొప్పి, అసౌక‌ర్యం, గ్యాస్ట్రైటిస్ వ‌స్తాయి. అలాగే కొంద‌రిలో త‌ల‌తిర‌గ‌డం, నోట్లో పుండ్లు, ర‌క్త‌స్రావం అధికం కావ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక దీన్ని జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి. ఇక కిడ్నీ డ్యామేజ్ అయిన వారు, గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ఈ మెడిసిన్‌ను వాడ‌రాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts