Kama Kasturi : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలతో పాటు సుగంధ ద్రవ్యంగా ఉపయోగించే మొక్కలు కూడా ఉంటాయి. అలాంటి మొక్కల్లో కామ కస్తూరి మొక్క కూడా ఒకటి. దీనిని రుద్రజడ అని కూడా అంటారు. ఈ మొక్కను మన వాడుక భాషలో సబ్జాగింజల మొక్క అని కూడా అంటారు. కామ కస్తూరి మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఈ మొక్క ఆకులను చేత్తో నలిపి చూస్తే చక్కటి వాసన వస్తాయి. అలాగే ఈ వాసన చేతుల నుండి గంట వరకు పోకుండా అలాగే ఉంటుంది. ఈ మొక్క సుగంధ భరితమైన మొక్క. అలాగే రుద్ర జడ మొక్క ఆకులను ముద్దగా చేసి ఇంట్లో అక్కడక్కడ ఉంచడం వల్ల ఇంట్లోకి దోమలు, బొద్దింకలు వంటి కీటకాలు రాకుండా ఉంటాయి.
ఇంట్లో కూడా చక్కటి వాసన వస్తుంది. అలాగే ఈ మొక్క నుండి ఎసెన్షియల్ ఆయిల్స్ ను తయారు చేస్తారు. అలాగే ఈ మొక్క నుండి సబ్జాగింజలను మన దేశం నుండి ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అలాగే ఈ సబ్జా గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను ఉపయోగిస్తే మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి తెలిసిందే. సబ్జా గింజలు నీటిలో వేస్తే తెల్లగా అవుతాయని మనందరికి తెలిసిందే. ఈ సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. రుద్ర జడ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ మొక్క ఆకులను, గింజలను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే పొట్ట సంబంధిత సమస్యలు, కడుపులో అల్పర్లు వంటి సమ్యలు కూడా తగ్గుతాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ రుద్ర జడ చెట్టు ఆకులను పచ్చడిగా చేసుకుని తింటారు. అలాగే కొన్ని దేవాలయాల్లో మొక్క ఆకులను మాలగా కట్టి దేవుడి మెడలో కూడా వేస్తూ ఉంటారు.
రుద్ర జడ మొక్క శివుడికి చాలా ఇష్టమైన మొక్క. ఈ రుద్ర జడను మొక్కను ఇంటి ముందు పెంచుకుంటే ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోతుంది. అలాగే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి ధనాకర్షణ పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ విధంగా రుద్ర జడ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల ఆరోగ్యపరంగా, ధన పరంగా ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.