Konda Pindi Aku : ఈ రోజుల్లో మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నీళ్లు తక్కువగా తాగడం వంటి వాటిని మూత్ర పిండాలలో రాళ్లు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మూత్రపిండాలలో పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను తొలగించడానికి వైద్యులు శస్త్ర చిక్సితలను సూచిస్తూ ఉంటారు. శస్త్ర చిక్సితల అవసరం లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉంటే వీపు కింది భాగంలో, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. మూత్రం విసర్జించేటప్పుడు మంట, నొప్పితో బాధపడాల్సి వస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఉండడం వల్ల కలిగే నొప్పి అంతా ఇంతా కాదు. మూత్రపిండాలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మూత్రపిండాలు నిరంతరం పని చేయాల్సిందే.
మన శరీరంలో ఉండే మలినాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. ఈ మూత్ర పిండాలు రోజుకు 2లీటర్ల మలినాలను, శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని బయటికి పంపిస్తాయి. రోజుకు కనీసం 5 నుండి 7 లీటర్లనీటిని తాగడం వల్ల మూత్రపిండాలల్లో రాళ్ల సమస్య బారిన పడకుండా ఉంటాం. మనం తగినంతగా నీటిని తాగకపోవడం వల్ల మన శరీరంలో ఉండే మలినాలు, రసాయనాలు అన్నీ కలసి గట్టిగా రాళ్ల లాగా మూత్రపిండాలలో తయారవుతాయి. అదే విధంగా మధ్యపానం, ధూమపానం వంటి వాటి వల్ల కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. పైసా ఖర్చు లేకుండా మన ఇంటి పరిసరాలల్లో ఉండే కొండపిండి ఆకును ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
దీనిని పిండి కొండ, తెలగపిండి మొక్క, పాశాన భేది అని కూడా పిలుస్తూ ఉంటారు. పాశాన భేది అంటే ఎంతటి రాళ్లనైనా కరిగిస్తుంది అని అర్థం. ఇవి ఎక్కుడపడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి. ఈ మొక్కను గుర్తించడం కూడా చాలా సులభమే. కొండపిండి మొక్క కాండానికి తెల్లని పువ్వులు ఉంటాయి. ఈ మొక్క మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తుందని.. వాటిని మూత్రం ద్వారా పోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లారిన తరువాత తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగి ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయని నిపుణలు చెబుతున్నారు.
అలాగే ఈ మొక్క తాజా ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి తిన్నా కూడా మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. ఈ మొక్క మొత్తాన్ని ఎండబెట్టి చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని వేడి నీటిలో కలిపి గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టుకుని తాగడం వల్ల కూడా మూత్రపిండాలలో రాళ్లు కరిగి బయటకు పోతాయి. కొండపిండి మొక్క ఆకులను కూరగా, లేదా పప్పుగా చేసుకుని తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కొండపిండి మొక్కను ఉపయోగించుకుని మూత్రపిండాలలో ఉండే రాళ్లను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.