మొక్క‌లు

Rocket Leaf : ఈ ఒక్క ఆకును వాడితే చాలు.. షుగ‌ర్ మాయం.. హార్ట్ ఎటాక్ లు రావు..

Rocket Leaf : రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ రక్తం గడ్డకట్టి రక్తనాళంలో ఇరుక్కున్నా, రక్త ప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి చేరినా ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెలోని సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి దీని నుండి బయటపడడానికి ముందు జాగ్రత్తగా ఇతర దేశాల్లో 20, 25 సంవత్సరాల వయసు నుంచి ఆస్ప్రిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు.

ఇలాంటి టాబ్లెట్స్ ని మనదేశంలో ఎకోస్ప్రిన్‌ అని డాక్టర్లు కొంచెం బీపీ ఎక్కువ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా లైఫ్ టైం వాడాలని చెబుతున్నారు. రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి నేచురల్ గా ఒక ముఖ్యమైన ఆకు ఉంది. అదే రాకెట్ ఆకు. దీనిని పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. సలాడ్స్ లో స్మూతీస్ లో వాడుకోవచ్చు. ఈ ఆకు మెదడులోనూ గుండెలోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు. దీనిలో పాలీ గ్లైకోసీటెడ్ ఫ్లేవన్స్ ఉండటం వల్ల రక్తంలోని ప్లేట్ లెట్స్ అన్నీ దగ్గరకు చేరి గడ్డ కట్టకుండా ఆపడానికి బాగా ఉపయోగపడుతున్నాయ‌ని నిరూపించారు.

many wonderful health benefits of rocket leaf

రాకెట్ లీఫ్ లో నైట్రెట్, నైట్రైట్ ఉండడం వల్ల ఘాటుగా ఉంటాయి. ఇందులో ఉండే గ్లూకో సైనోలెట్స్ ముఖ్యంగా మజిల్ సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్లేలా చేసి రక్తంలో చక్కెరస్థాయి తగ్గించడానికి, టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. అండాశ‌యాల‌లో నీటి బుడగలు రాకుండా చేయడానికి ఈ ఆకులు వాడుకోవడం చాలా మంచిది. అలాగే షుగర్ రాకుండా ఆపడానికి ఈ ఆకు ఉపయోగపడుతుంది. దీనిని శీతాకాలంలో ఇంట్లోనే విరివిరిగా పండించుకోవచ్చు. దీని విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి.

Admin